Bhadrachalam Godavari Floods LIVE*: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Bhadrachalam Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 15, 2022, 08:38 PM IST
Bhadrachalam Godavari Floods LIVE*: భద్రాచలం వద్ద గోదావరి డేంజర్ బెల్స్.. ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
Live Blog

Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. అంతకంతకు నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రమాదక స్థాయిలో గోదావరి పరుగులు పెడుతోంది. భద్రాచలం వద్ద 70.80 అడుగులకు నీరు చేరింది. మరికొన్ని గంటల్లో ధవళేశ్వరానికి భారీగా వరద నీరు చేరనుంది.

 

15 July, 2022

  • 20:29 PM

    Godavari floods latest updates from Bhadrachalam Kothagudem: శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఉన్న సమాచారం ప్రకారం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి 70.80 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది.  ప్రస్తుతం 24.18 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడి నుంచి దిగువకు వెళ్తున్నట్టు అధికారులు తెలిపారు. 

    మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు కాగా.. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఆపై దాదాపు 18 అడుగుల ఎత్తున గోదావరి పరుగులెడుతోంది.

  • 20:28 PM

    భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి
    లోతట్టు ప్రాంతాలు జలమయం
    రంగంలోకి ఆర్మీ బృందాలు
    భద్రాచలం చేరుకున్న 101 మంది సిబ్బంది

  • 20:09 PM

    వరదలపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
    వరద పరిస్థితులపై కలెక్టర్లతో చర్చ
    గోదావరి పరివాహక ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని ఆదేశం
    వరద ప్రభావిత ప్రాంతాల్లో సీనియర్ అధికారుల నియామకం
    24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
    వరద బాధితులకు అండగా ఉండాలి
    ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు
    48 గంటల్లో అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశం
    ప్రతి కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సాయం

  • 18:53 PM

    ఏపీలో లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలోని వరదలపై సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోస్తాంధ్ర జిల్లాల్లోని పరిస్థితులను జిల్లా కలెక్టర్ల నుంచి తెలుసుకున్నారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారిని ఎంపిక చేశారు. మరో 24 గంటలపాటు మరింత అప్రమత్తం అవసరమని ఆదేశించారు.

  • 17:59 PM

    గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లోని పరిస్థితిని పర్యవేక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ప్రవాహం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70.30 అడుగులుగా ఉంది. 
     

  • 14:56 PM

    భద్రాచలంలో గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరడంతో పట్టణంలోని పలు కాలనీల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటి నుంచి వృద్ధురాలిని తరలిస్తున్న దృశ్యం ఈ ట్వీట్‌లో చూడవచ్చు.

  • 14:06 PM

    గోదావరిలో వరద దృశ్యాలు..

  • 13:22 PM

    గోదావరి వరద ఉధృతి

    ధవళేశ్వరం వద్ద  మూడో ప్రమాద హెచ్చరిక

    ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 19.70 లక్షల క్యూసెక్కులు

    కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్న విపత్తుల సంస్థ ఎండి బి. ఆర్ అంబేద్కర్ 

    రాత్రికు వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం

    22 లక్షల క్యూసెక్కులు చేరితే 6 జిల్లాల్లో 44 మండలాల్లోని 628 గ్రామలపై ప్రభావం

    వరద ఉదృతం దృష్ట్యా ముందస్తుగా అదనపు సహాయక బృందాలు 

    సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

    అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

    ఏలూరు జిల్లాలో 1 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

    పశ్చిమ గోదావరిలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

    గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    - ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

  • 12:48 PM

    భద్రాచలం వద్ద గోదావరిలోకి 23.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం...

  • 12:42 PM

    నిన్నటి అల్పపీడనం ఇవాళ ఒడిశా, పరిసర ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న  ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి  ఉంది. 

    ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి  నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి  తేలికపాటి  నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. 
      

  • 12:39 PM

    భద్రాచలంలో గోదావరి నీటిమట్టం ఈ మధ్యాహ్నం 3 గంటలకు 73 అడుగులకు చేరుతుందని అంచనా..  డేంజర్ జోన్‌గా ప్రకటించిన అధికారులు...

     

  • 12:31 PM

    భద్రాచలంలో గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి ఎత్తు 86 అడుగులు.. నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువవడంత ో భయాందోళనలో స్థానికులు.. భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీల్లోకి ఇప్పటికే వరద నీరు... స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికార యంత్రాంగం... సహాయక చర్యలను మంత్రి పువ్వాడ అజయ్ పర్యవేక్షిస్తున్నారు

  • 12:27 PM

    భద్రాచలంలో భారీ వరద కారణంగా మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో 37 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

  • 12:21 PM

    వరద సహాయక పనుల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని సీఎల్పీ భట్టి విక్రమార్క పిలుపు 

    బాధితులకు అండగా ఉండాలి

    రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉంది.

    ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు  అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారు.

    వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, బట్టలు ఏది అవసరం ఉంటే అది అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పని చేయాలి..

    కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికుల లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలి.

    ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత కష్టాలలో ఉన్నారు.

    ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలం అయ్యారు.

    కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం.ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చడంలో ముందుండి పని చేయాలి.. - భట్టి విక్రమార్క

  • 12:16 PM

    భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరద పోటెత్తడంతో పలు మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటివరకూ 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • 12:15 PM

    భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఆందోళనలో స్థానికులు

     

  • 12:11 PM

    భద్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని ఆదేశాలిచ్చారు.

Trending News