Liquor Shops Closed: మందు బాబులకు బ్యాడ్ న్యూస్... ఆదివారం (ఏప్రిల్ 10) హైదరాబాద్‌లో అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మద్యం షాపులను మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైన్ షాప్స్, కల్లు దుకాణాలు మూసివేయాల్సిందిగా పోలీస్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే స్టార్ హోటల్స్‌లోని బార్స్, రిజిస్టర్డ్ క్లబ్స్‌కు మాత్రం మినహాయింపునిచ్చారు. పండగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో మద్యం షాపుల మూసివేతకు పోలీస్ శాఖ ఆదేశాలిచ్చింది.
శ్రీరామ నవమి సందర్భంగా భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో శోభాయాత్ర జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర రాత్రి 8గంటలకు సుల్తాన్ బజార్‌కు చేరి ముగుస్తుంది. అటు భైంసాలోనూ శోభాయాత్ర నిర్వహించనున్నారు. స్థానిక పోలీసులు అనుమతినివ్వనప్పటికీ... హైకోర్టును ఆశ్రయించడంతో శోభాయాత్రకు లైన్ క్లియర్ అయింది. అయితే పోలీసుల అనుమతించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలని సూచించింది.
Also Read: Pushpa Villain in Karimnagar: కరీంనగర్లో పుష్ప విలన్... ఇమిటేషన్ కాదు... ఏడేళ్లుగా ఇదే గెటప్...
Umran Malik: బుల్లెట్ బంతి వేసిన సన్‌రైజర్స్ బౌలర్.. ఐపీఎల్ 2022లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook