మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న ధరలు

దసరా పండగ నేపథ్యంలో అనధికారికంగా పెరిగిన లిక్కర్ ధరలు

Last Updated : Oct 7, 2019, 08:41 PM IST
మద్యం ప్రియులకు చుక్కలు చూపిస్తున్న ధరలు

దసరా పండగ పుణ్యమా అని కొంతమంది మద్యం దుకాణాల యజమానులు ఎంఆర్పీ ధరలకన్నా అధిక ధరలకు లిక్కర్ అమ్ముతూ కాసుల పండగ చేసుకుంటున్నారు. బీరుకు రూ.10, క్వార్టర్‌కు రూ.10, ఫుల్‌ బాటిల్‌ అయితే రూ.50 చొప్పున అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. మద్యం సేవిస్తేనే పండగ అని భావించే మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎక్కువ ధరలకు మద్యం అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అనధికారికంగా పెంచిన ధరలతో మద్యం ప్రియులు షాక్ తింటున్నారు. ఇదే విషయమై ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కి ఫిర్యాదు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలంలో వైన్ షాపు వద్ద ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారంటూ సదరు వ్యక్తి చేసిన ఫిర్యాదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్ సభర్వాల్.. ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌కి, ఆ శాఖ అధికారులకు ట్విటర్ ద్వారా ఫార్వార్డ్ చేశారు.

Trending News