Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులు

Krishna And Godavari Projects Getting Heavy Water Flow In Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంటోంది. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్ప వరద వస్తుండగా.. గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 21, 2024, 04:24 PM IST
Telangana Projects Flow: తెలంగాణకు పోటెత్తుతున్న వరద.. నిండుకుండలుగా ప్రాజెక్టులు

Krishna And Godavari Projects: వర్షాకాలం ప్రారంభమైన నెల రోజుల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలకు జల కళ సంతరించుకుంది. కృష్ణా పరివాహాక ప్రాంతానికి ఇప్పడిప్పుడే వరద చేరుకుంటుండగా.. గోదావరి పరివాహాక జలశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. మొన్నటి దాకా ఎండలతో నీరు లేక అడుగంటిన జలశయాలకు భారీగా వరద చేరుకుంటోంది. అయితే కూలిపోయిందని ప్రచారం జరిగిన కాళేశ్వరం మళ్లీ పూర్వరూపం సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజ్‌ భారీ వరదతో కళకళలాడుతోంది. 85కు 85 గేట్లు తెరచుకోవడంతో వరద కిందకు వెళ్తోంది. గోదావరి పరివాహకంలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. లక్ష్మీగడ్డ బ్యారేజ్‌ మొదలుకుని భద్రాచలం వరకు గోదావరి హోరున ప్రవహిస్తోంది.

Also Read: Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ

 

కాళేశ్వరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్లకు నేరు చేరింది. కాళేశ్వరం గోదావరి వద్ద నీటిమట్టం 8.500 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. లక్ష్మీ బ్యారేజ్‌కి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 3,73,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల. ఇన్ ప్లో , ఔట్ ఫ్లో 3,73,500 క్యూసెక్కులు ఉంది. 

లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 16.17 టీఎంసీలు

Also Read: MMTS Cancelled: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. 2 రోజులు ఎంఎంటీఎస్‌ రైళ్లు బంద్‌

 

భద్రాచలం
కొన్ని రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షలు పడటంతో వాగులు, వంకలు వర్షం నీటితో ముంచెత్తిపోతున్న తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గంటగంటకు క్రమేపి గోదావరి నీటిమట్టం పెరగటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.8 అడుగులు దాటి ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచారు. దిగువ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జీతిస్ వి పాటేల్ ఆలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మిడ్‌మానేర్‌ ప్రాజెక్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయం (మధ్య మానేరు)కు 525 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయానికి మానేరు, మూల వాగుల నుంచి వరద చేరుతోంది.
పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు (318 మీటర్లు)
ప్రస్తుత నీటి నిల్వ 5.61 టిఎంసీలు (305.33 మీటర్లు)

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు వరద నీరు చేరుతుంది. వరద ఇన్ ఫ్లో 19,686 క్యూసెక్కులు వస్తుంది. దీంతో నాలుగు గేట్లను ఎత్తివేసిన అధికారులు దిగువకు 18,227 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కొద్ది రోజుల కిందట ఎండిపోయి కడెం ప్రాజెక్టు వెలవెలపోగా.. ఇప్పుడు వరదతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022, 23లలో కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. రెండేళ్లు కడెం ప్రాజెక్టు భయానక పరిస్థితికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేశారు. అయినా కూడా పరివాహక రైతుల్లో ఆందోళన నెలకొనే ఉంది.

శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు
పూర్తి స్థాయి నీటి నిల్వ
80.5 టీఎంసీలు
ప్రస్తుతం    19.185 టీఎంసీలు
పూర్తి స్థాయి నీటిమట్టం
1067.40    మీటర్లు
ప్రస్తుతం 332.53 మీటర్లు
ఇన్‌ఫ్లో 18,518 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో : 9,874 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటిమట్టం
590 అడుగులు
ప్రస్తుతం
504.50 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ
312.5050 టీఎంసీలు
ప్రస్తుతం
122.5225 టీఎంసీలు

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
పూర్తిస్థాయి నీటినిల్వ
9.657 టీఎంసీలు
ప్రస్తుతం
7.645 టీఎంసీలు

పూర్తిస్థాయి నీటిమట్టం 
318.516 మీటర్లు
ప్రస్తుతం
317.500 మీటర్లు

శ్రీశైలం ప్రాజెక్టు
ఇన్ ఫ్లో 90,800 క్యూసెక్కులు 

స్పిల్ వే 17 గేట్లు ఎత్తివేత 66,810 క్యూసెక్కులు 

విద్యుత్ ఉత్పత్తి:
33,084 క్యూసెక్కులు

శ్రీశైలం అవుట్ ఫ్లో:- 99,894 క్యూసెక్కులు
పూర్తిస్థాయి అవుట్ ఫ్లో:- 1,04,416 క్యూసెక్కులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News