Big Debate With Bharath : ఎర్రబెల్లి హత్యకు కొండా దంపతులు మావోలతో కలిసి స్కెచ్ వేసింది నిజమేనా ?

Konda Surekha Comments on Errabelli Dayakar Rao: తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుతొలగించుకునేందుకు కొండా దంపతులు మావోయిస్టులతో కలిసి స్కెచ్ వేశారనే ఆరోపణలకు ఆమె ఏం సమాధానం చెబుతారు ? ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్లకు ఎక్కడ చెడింది ? ఎందుకు చెడింది తెలియాలంటే ఇవాళ రాత్రి 7:30 గంటలకు మీ జీ తెలుగు న్యూస్‌లో కొండా సురేఖతో ఎక్స్‌క్లూజీవ్ స్పెషల్ చిట్‌చాట్ షో 'బిగ్ డిబేట్ విత్ భరత్' తప్పక చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 10:45 PM IST
  • కొండా మురళి, కొండా సురేఖవి ఫ్యాక్షన్ రాజకీయాలా ?
  • తమకు అడ్డొస్తే ఎంతటి వారినైనా అడ్డు తొలగించుకుంటారా ?
  • కొండా దంపతులు మంచికి మంచి.. పంచ్‌కి పంచ్ అనేది నిజమేనా ?
Big Debate With Bharath : ఎర్రబెల్లి హత్యకు కొండా దంపతులు మావోలతో కలిసి స్కెచ్ వేసింది నిజమేనా ?

Konda Surekha Exclusive Interview: కొండా సురేఖ... కొండా మురళి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన జంట. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలుపెడితే.. వైఎస్ఆర్, కేసీఆర్ పాలన వరకు వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమదే పైచేయి అయ్యేందుకు చేయని ప్రయత్నాలు లేవు. నియోజకవర్గం, జిల్లాలోనే కాదు... రాష్ట్ర రాజకీయాల్లోనూ కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ అని కొందరంటే.. రాజకీయాల్లోనే తమది అంతా ఒక సెపరేట్ బ్రాండ్ అని అంటారు కొండా దంపతులు. గమ్యం ఏదైనా.. లక్ష్యం ఎంతటి వారైనా.. తమ రాజకీయ ప్రత్యర్థిపై కలిసి యుద్ధం చేయడంలో వీరిది అన్యోణ్య దాంపత్యం. 

వరంగల్ జిల్లాలో తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుతొలగించుకునేందుకు కొండా దంపతులు మావోయిస్టులతో కలిసి స్కెచ్ వేశారనే ఆరోపణలకు ఆమె ఏం సమాధానం చెబుతారు ? ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్లకు ఎక్కడ చెడింది ? ఎందుకు చెడింది ? ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న నేతపై పబ్లిగ్గా ఘాటు వ్యాఖ్యలు చేయడానికైనా వెనుకాడని ధైర్యం వాళ్లకు ఎవరిచ్చారు ? ఎక్కడి నుంచి వచ్చింది ? కొండా దంపతులు భూములు, చెరువులు కబ్జా చేయడంలో ముందుంటారనే ఆరోపణల్లో నిజమెంత అంటే కొండా సురేఖ ఏం చెబుతారు ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News