Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌కి అంత దమ్ముందా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ సవాల్

Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Written by - Pavan | Last Updated : Oct 12, 2022, 04:39 AM IST
  • టీఆర్ఎస్ పుట్టకముందే రాజగోపాల్ రెడ్డి ఒక కాంట్రాక్టర్..
  • నిబంధనల ప్రకారమే సుశీ ఇన్‌ఫ్రాకు కాంట్రాక్టులు
  • కేసీఆర్‌కి ఏమీ లేనప్పుడే సాయం చేశా..
  • నా రాజీనామాతో ఊర్లకు ఊర్లు దావత్‌లకు అడ్డాలయ్యాయి.
Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌కి అంత దమ్ముందా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ సవాల్

Komatireddy Rajagopal Reddy: మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు కూడా  తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాటలో నడుస్తున్నాడేమో అని కోమటిరెడ్డి సందేహం వ్యక్తంచేశారు. తెలంగాణలో కుటుంబ పాలన మీద వస్తోన్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేక చిల్లర భాష ఉపయోగించి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

టీఆర్ఎస్ పుట్టకముందే రాజగోపాల్ రెడ్డి ఒక కాంట్రాక్టర్..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి అందించే కాంట్రాక్ట్ పనులను పొందడం కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపిలో చేరారు అని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు సైతం ఆయన మరోసారి గట్టి సమాధానం ఇచ్చారు. తాను ఇవాళ కొత్తగా కాంట్రాక్టర్‌ని కాలేదని.. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందు నుంచే తాను ఒక కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నానని అన్నారు. ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా తనకు కాంట్రాక్ట్ వ్యాపారాలు ఉన్నాయని.. కాంట్రాక్ట్ పనులు చేయడం తనకేమీ ఇప్పుడు కొత్త కాదని స్పష్టంచేశారు. తెలంగాణలో కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడినట్టే అంతటా జరుగుతోందని అనుకుంటున్నారని చెబుతూ.. టీఆర్ఎస్ నేతల తీరు చూస్తోంటే.. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.   

నిబంధనల ప్రకారమే సుశీ ఇన్‌ఫ్రాకు కాంట్రాక్టులు
తన కాంట్రాక్ట్ సంస్థ సుశీ ఇన్‌ఫ్రాకు లాభం చేకూరేలా అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని టీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని.. అవసరమైతే ఈ అంశంపై యాదగిరిగుట్ట దేవాలయంలో ప్రమాణం చేసేందుకు తాను తడి బట్టలతో వస్తా.. కేసీఆర్‌కి అలా వచ్చే దమ్ముందా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరారు. చిత్తశుద్ది ఉంటే ఆ సవాలు స్వీకరించండి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. 

కేసీఆర్‌కి ఏమీ లేనప్పుడే సాయం చేశా..
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఏమీ లేనప్పుడే తెలంగాణ ఉద్యమం కోసం ఆర్ధిక సాయం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని.. కేసీఆర్, కేటీఆర్ అవన్నీ మరిచిపోయి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. నేరుగా ఎదుర్కునే దమ్ములేకే సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్స్ తెరిచి డ్రామాలాడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. జనాన్ని అలా మోసం చేయడం, తిమ్మిని బమ్మిని చేయడం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి బాగా అలవాటు కానీ ఇంకా నమ్మడానికి ఇక తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. 

నా రాజీనామాతో ఊర్లకు ఊర్లు దావత్‌లకు అడ్డాలయ్యాయి..
తాను రాజీనామా చేస్తే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసం అధికార పార్టీ నేతలు ఊర్లకు ఊర్లు దావత్‌లకు అడ్డాగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో ప్రస్తుతం ఉన్న వాతావరణం చూసిన జనం తమ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక రావాలి అని కోరుకునే దుస్థితి వచ్చిందన్నారు. తన రాజీనామాతో మునుగోడు ప్రజలు బాగుపడబోతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు. ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తాడు అనే విషయం అందరికీ తెలిసిపోయిందని.. మునుగోడులో కేసీఆర్ ( CM KCR ) ప్రకటించే వరాల జల్లు కూడా అలాంటిదేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Also Read : KCR visits BRS Office: యూపీ నుండి ఢిల్లీలో బీఆర్​ఎస్ కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్

Also Read : Munugodu Bypoll: మునుగోడులో ఏం జరుగుతోంది, కోమటిరెడ్డి ఎటువైపు, విదేశీ పర్యటన మర్మం

Also Read : Komatireddy Venkat Reddy: మంత్రి కేటీఆర్‌పై కోమటిరెడ్డి సెటైర్లు.. మరి నీ సిస్టర్ సంగతేంటని ఎద్దేవా

Also Read : KTR HOT COMMENTS: బఫూన్ గాళ్లతో వేగలేం.. మునుగోడు బరి నుంచి తప్పుకుంటాం! కేటీఆర్ సంచలన ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News