పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...

Woman dragged out by Grooms family: తనను ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని చెప్పి వలలో వేసుకున్న వ్యక్తి... తీరా మరో యువతితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధపడ్డాడని ఆరోపిస్తూ ఖమ్మంలో జరిగిన ఓ పెళ్లిని ఓ యువతి అడ్డుకోబోయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 05:21 PM IST
  • ఖమ్మంలో ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న ప్రియురాలు
  • తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపణ
  • జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు
పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...

Woman dragged out by Grooms family: ఖమ్మం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో జరిగిన ఓ వివాహ వేడుకను ఓ యువతి అడ్డుకునేందుకు యత్నించింది. ప్రేమ, పెళ్లి అని తన చుట్టూ తిరిగిన వ్యక్తి సీక్రెట్‌గా మరో యువతితో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి గొడవకు దిగింది. ఫంక్షన్ హాల్‌లోకి చొచ్చుకెళ్లిన ఆ యువతిని వరుడి బంధువులు అడ్డుకున్నారు. జుట్టు పట్టుకుని బలవంతంగా ఆమెను బయటకు ఈడ్చుకొచ్చారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.

బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్, రజనీ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పేరుతో రజనీకి దగ్గరైన శ్రీనాథ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లుగా రజనీ పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తుండటంతో శ్రీనాథ్ ఆమెకు కనిపించకుండా తిరుగుతున్నాడు. 

ఖమ్మం బైపాస్ రోడ్డులోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం (ఏప్రిల్ 15) శ్రీనాథ్ మరో యువతితో పెళ్లి చేసుకుంటున్నట్లు రజనీకి తెలిసింది. దీంతో ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లిన రజనీ పెళ్లి ఆపేయాలని గొడవకు దిగింది. అక్కడే ఉన్న వరుడు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు, బంధువులైన కొంతమంది మహిళలు రజనీని జుట్టు పట్టుకుని బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారు.

తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి శ్రీనాథ్ మోసం చేశాడని రజనీ వాపోయింది. తాను ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి గొడవ చేస్తానని తెలిసి ముందు గానే పోలీసులకు చెప్పి ఉంచారని పేర్కొంది. వరుడి బంధువులు తనపై దాడి చేసినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప వారిని అడ్డుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

Also Read: Vijay Shankar: ఆ విజయ్ శంకర్‌ ఎందుకురా బాబు.. క్రికెట్ ఆడకుండా నిషేధించండి! త్రీడీ ప్లేయర్ అంటే నవ్వొస్తుంది

Also Read: KGF 2 DAY1 COLLECTIONS: చరిత్ర సృష్టించిన రాఖీ భాయ్.. మొదటి రోజే రూ. 135 కోట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News