సూర్యాపేటకు సీఎం కేసీఆర్ అభయం..!

Last Updated : Oct 12, 2017, 07:54 PM IST
సూర్యాపేటకు సీఎం కేసీఆర్ అభయం..!

సూర్యాపేటలో జిల్లా  కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి గురువారం హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ జిల్లాపై వరాల జల్లు కురిపించారు.  కాళేశ్వరం ప్రాజెక్టును వీలైనతంత త్వరగా పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే సూర్యాపేటను జిల్లాగా ప్రకటిస్తామన్న హామీని టీఆర్‌ఎస్ నెరవేర్చిందని ఆయన తెలిపారు. అలాగే నాగార్జునసాగర్‌ ఏలేశ్వరం ప్రాంతం దగ్గర తొలుత నిర్మించాలని భావించారని.. కాకపోతే అప్పటి అధికార కాంగ్రెస్‌ నాయకులు చేసిన దగా వలన స్థలం మారిందని అభిప్రాయ పడ్డారు. నిజానికి ఆ ప్రాజెక్టు పేరు నంది కొండ అని.. తర్వాత అదే పేరును నాగార్జున సాగర్‌గా పిలుస్తున్నారని చెప్పారు. ఏలేశ్వరం దగ్గరలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే,  నల్గొండలో 10లక్షల ఎకరాలు బాగుపడేవి అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేటకి ఆయన వరాల జల్లులు కురిపించారు. ఆ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అయ్యేలా చూస్తానన్నారు. అలాగే జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయితీకి 15 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. 

Trending News