TS High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులొచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు తెలంగాణ హైకోర్ఠు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అలోక్ అరాధే నియమితులు కాగా, జస్టిస్ పి శ్యామ్ కౌశాయ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నియామకాలకు సంబందించి రాష్ట్రపతి ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ ఇద్దరు న్యాయమూర్తుల ప్రస్థానం ఇలా ఉంది.
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. ఈయనతో పాటు గుజరాత్, ఒడిశా, కేరళ హైకోర్టులకు సైతం ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుతో రాష్ట్రపతి ఆమోదించారు. అటు కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశిక్ జే దేశాయ్ నియమితులు కాగా గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుభాషిస్ తలపాత్ర నియమితులయ్యారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే 2018 నవంబర్ 17 నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉండి ఇటీవలే అదే హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయూన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ పి శ్యామ్ కొశాయ్ ఛత్తీస్గడ్ రాష్ట్రం జబల్పూర్లో 1967 ఏప్రిిల్ 30న జన్మించారు. 1991లో న్యాయమూర్తిగా ఎన్రోల్ అయిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించారు.
Also read: AP Heavy Rains: పది రోజుల్లో రెండు అల్పపీడనాలు, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook