Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసులో మరో ట్వీస్ట్..నిందితులకు బెయిల్ మంజూరు..!

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు కేసులో ఛార్జీషీట్ నమోదుకు రంగం సిద్ధమవుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 27, 2022, 10:04 AM IST
  • జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసు
  • ఎట్టకేలకు నిందితులకు బెయిల్
  • ఛార్జీషీట్ నమోదుకు రంగం సిద్ధం
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసులో మరో ట్వీస్ట్..నిందితులకు బెయిల్ మంజూరు..!

Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్‌ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి పిటిషన్‌ వేయడంతో జువైనల్ కోర్టు విచారించింది. ఐతే ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ధర్మాసనంలో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇదే కేసులో నిందితుడు మాలిక్ బెయిల్ పిటిషన్‌ను జువైనల్ కోర్టు తిరస్కరించింది. మరోవైపు జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. మొత్తం 420 పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీషీట్‌లో సాదుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. 

ఈకేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం మారింది. అత్యాచారం చేసిన వాహనం నుంచి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈకేసులో బాధితురాలి నుంచి రెండు సార్లు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. జైలులో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వాహనంలో దొరికిన వెంట్రుకలు, నాప్‌కిన్‌లు, వీర్యం నమూనాలు, తిని పారేసిన చూయింగమ్‌ల ఫొరెన్సిక్‌ నివేదిక వివరాలను ఛార్జీషీట్‌లో పొందపరిచారు. మరో రెండు రోజుల్లో కోర్టులో పోలీసులు సమర్పించనున్నారు. 

హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పబ్‌ వద్ద మైనర్ బాలికను కారులో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. నగర రోడ్లపై కారులో తిప్పుతూ దారుణానికి దిగారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేగింది. ఇందులో నిందితులంతా టీఆర్ఎస్, ఎంఐఎం నాయకుల పిల్లలే కావడంతో రాజకీయ విమర్శలు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు..నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుత వారంతా జైలులోనే ఉన్నారు.

Also read:Shyja Moustache: మీసమున్న మహిళ..  'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..

Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News