ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో జానారెడ్డి ?

                                     

Last Updated : Nov 26, 2018, 01:57 PM IST
ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో జానారెడ్డి ?

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీనియర్ నేత జానారెడ్డి నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలంలో ఉన్న పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత వాసులు తనను ఎంతగానో ఆదరించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

నా రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు

ప్రజాభిమానం విషయంలో తనకు ఏ ఇతర నేతలు సాటిరానని జానా కామెంట్స్ చేశారు. ఒకే నియోజకవర్గం నుంచి 7 సార్లు గెలిచి తాను చరిత్ర సృష్టించానని చెప్పుకొచ్చారు. తనలాగా ఇన్నిసార్లు ప్రజాభిమానంతో గెలుపొందే నాయకుడు రాష్ట్రంలో ఎవ్వరూ లేరు.. ఇకపై ఎవరూ రారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజలే తనను మహానేతను చేశారని కొనియాడారు. ఈ రికార్డు మరో నేత సాధించలేకపోయారని పేర్కొన్నారు.

పతాక స్థాయికి ఆధిపత్య పోరు

తెలంగాణ కాంగ్రెస్ లో అధిపత్యం పోరు మొదలైన విషయం బహిరంగ రహస్యమే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి  తో పాటు చాలా మంది సీనియర్ నేతలు ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం పారాడుతున్నారు. ఈ క్రమంలో జానారెడ్డి కొంత వరకు వెనకబడ్డారు. పార్టీ కార్యక్రమాల దగ్గర నుంచి ప్రచారం సభల్లో తగిన ప్రాధాన్యత లేదనే టాక్. పైగా తనుకు కుమారుడికి టికెట్ ఇప్పించులోకేని పరిస్థితి నెలకొంది.. ఈ తరుణంగా తన ప్రాధాన్యత తగ్గినట్లుగా భావిస్తున్న జానా తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యాలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

Trending News