మంత్రి అజయ్ కుమార్‌కి జగ్గా రెడ్డి హెచ్చరిక

మంత్రి అజయ్ కుమార్‌కి జగ్గారెడ్డి హెచ్చరిక

Last Updated : Oct 15, 2019, 12:55 AM IST
మంత్రి అజయ్ కుమార్‌కి జగ్గా రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకునే దుస్థితి రావడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసి కార్మిక సంఘాల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా సోమవారం జగ్గా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు తాను అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్‌ మానవతాదృక్పథంతో ఆలోచించి, కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. కేసీఆర్‌తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడి సమస్యను పరిష్కరించాలని.. లేదంటే మంత్రి పువ్వాడ అజయ్‌ ఇంటిని ముట్టడిస్తామని జగ్గా రెడ్డి హెచ్చరించారు.

Trending News