KTR VS KISHAN REDDY: నీలాంటి చెత్త కేంద్ర మంత్రిని ఇంతవరకు చూడలేదు.. కిషన్ రెడ్డిని ఏకిపారేసిన కేటీఆర్

KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 1, 2022, 02:53 PM IST
  • కిషన్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
  • మెడికల్ కాలేజీలపై వార్
  • కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు- కేటీఆర్
KTR VS KISHAN REDDY: నీలాంటి చెత్త కేంద్ర మంత్రిని ఇంతవరకు చూడలేదు.. కిషన్ రెడ్డిని ఏకిపారేసిన కేటీఆర్

KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అటు బీజేపీ కౌంటర్ గా టీఆర్ఎస్ నేతలు మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయంలోనూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందని గులాబీ నేతలు ఆరోపిస్తుంటే.. కేంద్ర నిధులను కేసీఆర్ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని కమలం నేతలు మండిపడుతున్నారు. తాజాగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్.

శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశ వ్యాప్తంగా కొత్తగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. మెడికల్‌ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్‌. మెడికల్‌ కళాశాలల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘ కిషన్‌ రెడ్డి గారూ..నేను మిమ్మల్ని సోదరునిగా గౌరవిస్తాను. కానీ మెడికల్‌ కళాశాలల కేటాయింపు గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంత్రిని చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని మీరు ప్రకటించారు, అది అబద్ధం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘ కిషన్ రెడ్డికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదు. హైదరాబాదులో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మీరు ప్రకటించారు. ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్‌లు దానిని వారి రాష్ట్రానికి మార్చారు. ఈ విషయంలో మీరు హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇంత జరుగుతున్నా మీరు మీ తప్పుడు వాదనలను సరిదిద్దుకోలేదు. తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’ అంటూ  కేటీఆర్‌ కౌంటరిచ్చారు.

Also Read : Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!  

Also Read : Mission Bhagiratha: మిషన్‌ భగీరథకు అవార్డు పచ్చి అబద్దం.. టీఆర్ఎస్ ది చిల్లర వ్యవహారమన్న కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News