KTR TWEET: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఎవరికి అవకాశం దొరికితే వాళ్లు రెచ్చిపోతున్నారు. తమదైన శైలిలో పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మెడికల్ కాలేజీలకు సంబంధించి శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిలదీస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును ఉదహరిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ సర్కార్ డైరెక్షన్ లోనే పని చేస్తున్నాయని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయో బీజేపీ నేతలు ముందే చెబుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ ఎన్నికల కమిటి సమావేశమైంది. ఆ సమావేశంలో పార్టీ నేతలకు బైపోల్ ఇంచార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. అందుకు సంబంధించిన వార్త పేపర్ లో వచ్చింది. అక్టోబర్ 15 లోపు మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని బన్సల్ పార్టీ నేతలకు చెప్పారని అందులో ఉంది. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందో బీజేపీ నేతలు ముందే చెబుతున్నారని విమర్శిస్తూ ఆ ట్వీట్ చేశారు. సీఈసీ స్వతంత్ర సంస్థ. అయినా ఎన్నికల సంఘం నిర్ణయాలు బీజేపీ చెప్పినట్లుగానే ఉంటున్నాయన్నది కేటీఆర్ ఆరోపణ.
Before "EC"
BJP announces
The Poll Dates!Before "ED"
BJP announces
The Names!Before "NIA”
BJP announces
The Ban!Before "IT”
BJP announces
The Amount!Before "CBI"
BJP announces
The Accused!Appropriately BJP should rename itself as;
"BJ...EC-CBI-NIA-IT-ED...P" pic.twitter.com/ZvwFlJW03w
— KTR (@KTRTRS) October 2, 2022
ఈసీ కంటే ముందే బీజేపీ ఎన్నికల తేది ప్రకటిస్తుంది.. ఈడీ కంటే ముందే నోటీసులు ఎవరకి వస్తాయన్నది బీజేపీ నేతలు చెబుతారు.. ఎన్ఐఏ కంటే ముందే ఏ సంస్థలపై నిషేదం విధిస్తారో కమలం నేతలు క్లారిటీ ఇస్తారు.. ఐటీ కంటే ముందే ఎన్ని కోట్ల స్కాం జరిగిందో కాషాయ నేతలు చెప్పేస్తారు.. సీబీఐ కంటే ముందే నిందితులు ఎవరో బీజేపీ నేతలు నిర్ధారిస్తారు అని కేటీఆర్ తన ట్వీట్ లో విమర్శించారు. అక్టోబర్ 15 వరకు మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ రాబోతుందని బన్సల్ చెప్పారన్న వార్త పేపర్ క్లిప్పింగ్ ను తన పోస్టుకు జత చేశారు కేటీఆర్.
Read also: Inter Board: జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్.. అలా చేస్తే గుర్తింపు రద్దే!
Read also: KCR NEW PARTY: కేసీఆర్ పార్టీ లీక్స్.. భారత రాష్ట్ర సమితి కాదట.. కొత్త పేరు ఇదేనట?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి