Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వడగళ్ల వానతో బెంబేలెత్తిన జనం

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో మరో గంటలో వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం కురిసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టుగానే నగరంలో భారీ వర్షం కురుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 08:40 PM IST
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. వడగళ్ల వానతో బెంబేలెత్తిన జనం

Heavy Rain in Hyderabad: భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పనులపై బయటికి వెళ్లిన నగరవాసులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఇంటి నుంచి వెళ్లిన వారు తమ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయం కావడంతో నగరం నలువైపుల రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. దీనికితోడు వర్షం నీరు రోడ్డెక్కడంతో రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో కొద్దిసేపట్లోనే లోతట్టు ప్రాంతాలకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  

పంజాగుట్ట, సోమాజీగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, బాలానగర్, సూరారం, జీడిమెట్ల, బాచుపల్లి, ప్రగతి నగర్, ఏఎస్ రావు నగర్, కాప్రా, ఈసీఐఎల్, మల్లాపూర్, నాచారం, ఉప్పల్, హబ్సీగూడ, తార్నాక, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్లు పడగా.. ఇంకొన్ని చోట్ల ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఇది కూడా చదవండి : YS Sharmila News Updates: కాసేపట్లో వైఎస్ షర్మిల విడుదల.. జైలు వద్దే ప్రెస్‌మీట్

ఇది కూడా చదవండి : CM KCR Speech: నేను కథలు చెప్పటం లేదు.. కళ్ల ముందు జరుగుతున్న చేదు నిజాలు: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News