Hyderabad Rains: తెలంగాణకు మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన

Telangana Rains Alert : అల్పపీడనాల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడ‌నం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2021, 01:49 PM IST
Hyderabad Rains: తెలంగాణకు మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన

Rains lash Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడ‌నం కొనసాగుతోంది. 

అల్పపీడనాల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మ‌రో రెండు రోజుల‌పాటు ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు (Telangana Rains Alert) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: Komati Reddy Rajgopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచనలన వ్యాఖ్యలు

ఉత్తర తెలంగాణ ప్రాంతాలైన నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ తెలంగాణ (Telangana)లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాలకు ఆరెంట్ అలర్ట్ సైతం జారీ చేసినట్లు సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News