Family Planning Operations: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

Family Planning Operations Failed: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 30, 2022, 01:42 PM IST
  • కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటన
  • 4కి చేరిన మృతుల సంఖ్య.. మరో మహిళ పరిస్థితి విషమం
  • ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటున్న మృతుల కుటుంబాలు
Family Planning Operations: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

Family Planning Operations Failed: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో మృతుల సంఖ్య 4కి చేరింది. కొలుకలపల్లి గ్రామానికి చెందిన మేరావత్ మౌనిక (25) అనే మహిళ అర్ధరాత్రి మృతి చెందగా.. సీతారాంపేట్‌కి చెందిన అవుతపురం లావణ్య (25) అనే మహిళ తెల్లవారుజామున మృతి చెందింది.  ఆదివారం మమత (25), సుష్మా (26) అనే ఇద్దరు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన మహిళల్లో ఏడుగురు ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.  చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి పట్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న మొత్తం 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ  ఆపరేషన్లు చేశారు.అయితే ఆపరేషన్లు ఫెయిల్ అవడంతో పలువురి పరిస్థితి విషమంగా మారింది. ఇప్పటివరకూ నలుగురు మృతి చెందగా... ఇద్దరు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మిగతా ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంపై పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డిపై గురి పెట్టిన బీజేపీ.. బండి సంజయ్ స్కెచ్ మాములుగా లేదుగా?

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు.. సిసోడియా బ్యాంక్ లాకర్లు ఓపెన్.. నెక్స్ట్ కవితేనా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News