Kcr Munugode Meeting: మునుగోడు కేసీఆర్ సభకు హైదరాబాద్ జనం.. స్థానిక నేతల తిరుగుబాటే కారణమా?

Kcr Munugode Meeting:  మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా జనసమీరణచేస్తోంది. లక్ష మందికి పైగా జనాన్ని తరలించాలని టార్గెట్ గా పెట్టుకుంది. కేసీఆర్ మునుగోడు సభకు హైదరాబాద్ నుంచి భారీగా జనాన్ని తరలిస్తోంది అధికార పార్టీ.

Written by - Srisailam | Last Updated : Aug 20, 2022, 09:07 AM IST
  • కేసీఆర్ మునుగోడు సభకు గ్రేటర్ జనం
  • 2 వేల కార్లతో కేసీఆర్ కాన్వాయ్
  • స్థానిక నేతల తిరుగుబాటే కారణమా?
 Kcr Munugode Meeting: మునుగోడు కేసీఆర్ సభకు హైదరాబాద్ జనం.. స్థానిక నేతల తిరుగుబాటే కారణమా?

Kcr Munugode Meeting:  మునుగోడులో జరగనున్న సీఎం కేసీఆర్ సభను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీగా జనసమీరణచేస్తోంది. లక్ష మందికి పైగా జనాన్ని తరలించాలని టార్గెట్ గా పెట్టుకుంది. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంచార్జులుగా నియమించింది హైకమాండ్. గత వారం రోజులుగా గులాబీ ఎమ్మెల్యే ఊరురూ తిరిగి జన సమీకరణకు ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా కేసీఆర్ మునుగోడు సభకు హైదరాబాద్ నుంచి భారీగా జనాన్ని తరలిస్తోంది అధికార పార్టీ. సీఎం కేసీఆర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన నేతలు 2 వేల కార్లతో క్వానాయ్ లో రానున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మునుగోడు నియోజకవర్గం నుంచి స్థానికులు సభకు ఆశించినంతగా రాకపోవచ్చనే అనుమానంతోనే హైదరాబాద్ నుంచి జనాలను తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు నుంచి కేసీఆర్ భారీ కాన్వాయ్ మొదలు కానుంది. గ్రేటర్ నుంచి కార్లు, జనసమీకరణ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారని తెలుస్తోంది.  ప్రతి కారుకూ  ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించాలని పార్టీ అధినాయకత్వం సూచించిందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యే 3 నుంచి 4 వందల కార్లు పంపిస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు.మొత్తంగా గ్రేటర్ నుంచి దాదాపు 2 వేల కార్లలో 10 నుంచి 15 వేల మందిని మునుగోడు తరలించేలా అధికార పార్టీ సన్నాహాలు చేసిందని అంటున్నారు. మునుగోడు  వేదికగా బలప్రదర్శనకు టీఆర్ఎస్ దిగుతుందని చెబుతున్నారు. గ్రేటర్ నుంచి జనసమీకరణ కోసం శుక్రవారం తెలంగాణ భవన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఏ నియోజకవర్గం నుంచి ఎన్ని కార్లు వస్తాయని లెక్కలు వేసుకుని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.

ఇక మునుగోడు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి 20వేల మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉండగా లక్ష మందికి పైగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళా సంఘాలతో ఇంచార్జ్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అయితే ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గం నుంచి కాకుండా జల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎందుకు జనాన్ని తరలిస్తున్నారన్నది చర్చగా మారింది. స్థానికంగా జనాలు వచ్చే అవకాశాలు లేవని గుర్తించిన హైకమాండ్.. ఇలా ఏర్పాట్లు చేసిందని అంటున్నారు.  అధికార పార్టీ నేతలు మాత్రం నియోజకవర్గం నుంచే లక్ష మందికి పైగా తరలిస్తున్నామని.. బల ప్రదర్శన చేయడం కోసమే ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నామని చెబుతున్నారు. జిల్లాలో గతంలో ఎప్పుడు జరగనంత భారీగా మునుగోడు సభ ఉండబోతుందని చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ఖరారు అయ్యారని తెలియడంతో.. అతని వ్యతిరేక వర్గమంతా జనసమీకరణకు దూరంగా ఉందని చెబుతున్నారు.

Also Read : Power Crisis: తెలంగాణకు కరెంట్ గండం.. రైతులు సహకరించాలన్న ప్రభుత్వం

 

Also Read : Munugode Bypoll: కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం

Also Read : Munugode Bypoll: మునుగోడు బీజేపీలో ముసలం.. ఈటల రాజేందర్ పై గొంగిడి టీమ్ ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 
Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News