Traffic Constable Saves Life: శభాష్ బోలు.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Traffic Constable Saves Life: ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు ప్రయత్నాలు ఫలించడంతో విద్యుత్ షాక్ కి గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అదే సమయంలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకోవడంతో అతడిని అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.

Written by - Pavan | Last Updated : Nov 23, 2022, 10:02 AM IST
  • మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
  • విద్యుత్ షాక్‌తో అల్లాడుతున్న వ్యక్తికి ప్రాణం పోసిన బోలు
  • అటు అధికారులు, ఇటు జనం నుంచి అభినందనల వెల్లువ
Traffic Constable Saves Life: శభాష్ బోలు.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Traffic Constable Saves Life: బంజారాహిల్స్‌లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై కింద పడిన వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. విద్యుత్ షాక్ కారణంగా తొలుత కిందపడి కొట్టుకున్న వ్యక్తి షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు హుటాహుటిన ఆ వ్యక్తి వద్దకు చేరుకుని అతడి ఛాతిపై రెండు చేతులు పెట్టి బలంగా నొక్కుతూ అతడి శ్వాస ప్రక్రియ సాధారణ స్థాయికి వచ్చేంతవరకు సపర్యలు చేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు, ట్రాఫిక్ సిబ్బంది 108 సిబ్బందికి సమాచారం అందించారు. 

ఈలోగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు ప్రయత్నాలు ఫలించడంతో విద్యుత్ షాక్‌కి గురైన వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అదే సమయంలో 108 అంబులెన్స్ అక్కడికి చేరుకోవడంతో అతడిని అంబులెన్స్ ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ నుండి ఒక వ్యక్తిని కాపాడి అతడి ప్రాణాలు నిలబెట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలుని ఉన్నతాధికారులు అభినందించారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ బోలు సదరు వ్యక్తిని కాపాడి, ఊపిరి పోస్తుండగా అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసిన నెటిజెన్స్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 

ట్రాఫిక్ పోలీసులు అంటే చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులను ఆపి జరిమానా ( Hyderabad Traffic Police ) విధించే సిబ్బందే గుర్తుకొస్తారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అవయవాల తరలింపునకు ( లైవ్ ఆర్గాన్స్) తమ వంతు కృషి చేస్తోన్న పోలీసులతో పాటు అప్పుడప్పుడు ఇలా ఆపదలో ఉన్న వారిని ఆదుకుని వారికి తమ వంతు సాయం అందిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఏదేమైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ బోల్ చేసిన పనిని మనం అభినందించి తీరాల్సిందే. శభాష్ బోలు.

Also Read : Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ప్రభుత్వానిదా ? ప్రైవేటుదా ? బండి సంజయ్ సూటి ప్రశ్నలు 

Also Read : TRS MLAs Poaching Case: సిట్ విచారణకు రాని వారిపై చర్యలు తప్పవా ?

Also Read : Revanth Reddy: సోమేష్ కుమార్‌ని కలిసిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News