గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ (Telangana) ప్రజలను తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. నగరవాసులను ఆందోళనకు గురిచేసిన అంశాలలో పురానాపూల్ బ్రిడ్జి (Puranapool Bridge Cracks) ఒకటి. మూసీ ఉగ్రరూపానికి పురానాపూల్ బ్రిడ్జి (Puranapool Bridge Pillar Damaged) దెబ్బతిందని, అందుకు ఈ పిల్లర్ సాక్ష్యమంటూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించారు.
జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఈ దత్తుపథ్, డీఈ ఫైజల్, ఏఈ శ్రీనివాస్ వచ్చి పురానాపూల్ బ్రిడ్జిని పరిశీలించారు. అంతా బాగానే ఉందని నిర్ధారించారు. భారీ వాహనాలు తప్ప.. రెగ్యూలర్ వాహనాలు రాకపోకలు కొనసాగించవచ్చునని చెప్పారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి పురానాపూల్ బ్రిడ్జిపై నిలిపివేసిన వాహన రాకపోకలను సోమవారం తిరిగి ప్రారంభించారు.
- Also Read : Vijay Sethupathi 800 Controversy: మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి
సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని, అధికారిక సమాచారం ఉంటేనే నమ్మాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కరుణాకర్, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ రామలింగరాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకటేశ్వర్ సైతం అధికారులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పురానాపూల్ పిల్లర్ ఊగుతుందన్నది కేవలం వదంతి మాత్రమేనని, రాకపోకలు యథావిథిగా ఉంటాయని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe