Hyderabad Press Club: బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం.. కోర్టు ధిక్కరణే అంటున్న మరో వర్గం

Hyderabad Press Club Newly Elected Body Takes Charge: హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. క్లబ్‌ అధ్యక్షులుగా వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంత్ రావు, సహాయ కార్యదర్శులుగా రమేష్‌ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 09:12 PM IST
  • ఈనెల 13న జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు
  • బ్యాలట్‌ పేపర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తంచేసిన ప్రత్యర్థి ప్యానల్‌
  • ఎన్నికల ఫలితాలపై స్టే విధించిన నాంపల్లి కోర్టు
Hyderabad Press Club: బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యవర్గం.. కోర్టు ధిక్కరణే అంటున్న మరో వర్గం

Hyderabad Press Club Newly Elected Body Takes Charge: హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. క్లబ్‌ అధ్యక్షులుగా వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంత్ రావు, సహాయ కార్యదర్శులుగా రమేష్‌ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు.. పద్మావతి, మర్యాద రమాదేవి, ఉమా దేవి, కస్తూరి శ్రీనివాస్, గోపరాజు, బాపు రావు, రాఘవేందర్  రెడ్డి, అనిల్ కుమార్, తిగుళ్ల శ్రీనివాస్, వసంత్ కుమార్‌ కార్యవర్గ సభ్యులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈనెల 13న ప్రెస్‌క్లబ్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఆ సమయంలో బ్యాలట్‌ పేపర్ల విషయంలో ఓ ప్యానల్‌ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, బ్యాలట్‌ పత్రాలను పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో బ్యాలట్‌ పేపర్ల వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. 

అయితే, తాజాగా ప్రెస్‌క్లబ్‌ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసినట్లు అధ్యక్షుడు వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మరోవైపు.. ఎన్నికల ప్రక్రియలో రెండు గుర్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధ్యక్ష అభ్యర్థి సూరజ్‌ భరద్వాజ్‌ ఇది.. కోర్టు ధిక్కరణ (Nampally court imposes stay on elections results) కిందికి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు.

Also read : Komuram Bheem History: కొమురం భీమ్ చరిత్ర.. ఒక సాధారణ యువకుడు వీరుడు ఎలా అయ్యాడు ?

Also read : RRR: 'ఆర్ఆర్ఆర్'కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News