Discount on Pending Traffic Challans: ట్రాఫిక్ ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
మార్చి 1 నుంచి 30 వరకు ఆన్‌లైన్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా పెండింగ్ ఈ-చలాన్లు చెల్లించేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో వాహనదారులు చెల్లించని జరిమానా సుమారు రూ.600 కోట్లకు చేరింది. దీంతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు పోలీస్ శాఖ రాయితీ ప్రతిపాదనను తీసుకొచ్చింది.
గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ చలాన్లపై రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమై పెండింగ్ చలాన్లపై చర్చించారు. ఈ సమావేశంలోనే చలాన్లపై రాయితీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో అటు ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం సమకూరనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook