Police filed pocso case against jani master: ప్రస్తుతం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఘటన వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలో.. ఫెమస్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్.. లేడీ కొరియో గ్రాఫర్ ను అత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ముంబైలో ప్రోగ్రామ్ కు వెళ్లినప్పుడు జానీ మాస్టర్ .. లాడ్జీలో యువతిపై బలవంతంగా అత్యాచారం చేశాడని కూడా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి తన పట్ల జానీ మాస్టర్ ఏ విధంగా వేధించాడో అన్ని విషయాలను పోలీసులకు ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై.. హైదరాబాద్ పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
లేడీ కొరియో గ్రాఫర్.. తనపై జానీ మాస్టర్ అత్యంత క్రూరంగా, అత్యాచారం చేశాడని కూడా కన్నీళ్లుపెట్టుకుంది. తన కోరిక తీర్చకుంటే.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని, యువతిని లొంగదీసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం..నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర ఒక యువతికి.. 2017 లో పరిచయం ఏర్పడింది.
ఒక డ్యాన్స్ షోలో..సదరు యువతి మంచి ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు యువతి 2019 లో జానీ మాస్టర్ టీమ్ లో ఆమె చేరింది. ఒక ప్రొగ్రామ్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు..యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట రాయదుర్గం పోలీసులు జీరో ఎఫైఐఆర్ నమోదు చేసి, నార్సింగ్ పీఎస్ కు కేసు బదిలీచేశారు.
Read more: Viral Video: నా గణపతి బప్పను తీసుకెళ్లొద్దు.. నిమజ్జనం వేళ ఎమోషనల్ అయిన శునకం.. వీడియో వైరల్..
జానీ మాస్టర్ భార్య కూడా.. వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ ను జనసేన సస్పెండ్ చేసింది. కొరియో గ్రాఫర్ సంఘం కూడా ఆయనను తాత్కలికంగా సభ్యత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళ సంఘాలు, తెలంగాణ మహిళ కమిషన్ కు కూడా.. సదరు ఘటనపై ఫిర్యాదు చేశాయి. బీజేపీ మహిళ మోర్చా సైతం.. ఈ ఘటనను ఖండించింది. ఇదిలా ఉండగా.. అల్లుఅర్జున్ బాధిత కొరియోగ్రాఫర్ కు అండగా నిలిచారని తెలుస్తోంది. తన మూవీస్ లో కొరియో గ్రాఫర్ గా యువతికి అవకాశంఇస్తానని కూడా ప్రకటించారు.