HYD MMTS: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... రద్దయిన రైళ్ల వివరాలివే..

Hyd MMTS Services Cancelled: హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు మళ్లీ రద్దయ్యాయి. రద్దయిన రైళ్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 31, 2022, 07:46 AM IST
  • హైదరాబాద్‌లో మరోసారి ఎంఎంటీస్ సర్వీసులు రద్దు
  • మొత్తం 34 సర్వీసులు రద్దు చేసిన రైల్వే
  • ఏయే మార్గాల్లో ఎన్ని రైళ్లు రద్దయ్యాయంటే
HYD MMTS: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... రద్దయిన రైళ్ల వివరాలివే..

Hyd MMTS Services Cancelled: ఇటీవల భారీ వర్షాల కారణంగా రద్దీ బాగా తగ్గిపోవడంతో హైదరాబాద్ లోకల్ ట్రైన్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే తరచూ తగ్గిస్తూ వస్తోంది. ఈ ఆదివారం (జూలై 31) కూడా 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీస్ రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గాల్లో ఒక్కో ఎంఎంటీస్ రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

రద్దయిన రైళ్ల వివరాలు: 

సికింద్రాబాద్-లింగంపల్లి : 47150 ఎంఎంటీస్ సర్వీస్ రద్దు

లింగంపల్లి-సికింద్రాబాద్‌ : 47195 ఎంఎంటీస్ సర్వీస్ రద్దు 

ఫలక్ నూమా-లింగంపల్లి  : 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి-ఫలక్ నూమా : 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

లింగంపల్లి-హైదరాబాద్ : 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్-లింగంపల్లి : 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఎంఎంటీస్ రైళ్ల రద్దును గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలి.

 

 

Also Read: Horoscope Today July 31st sunday : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఇవాళ అన్నింటా ఆచీ తూచీ వ్యవహరించాలి...

Also Read: Telangana Rains Alert:తెలంగాణపై శాంతించని వరుణుడు.. భారీ వర్షాలతో రైతులు ఆగమాగం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News