నవంబర్‌లో హైద్రాబాద్ మెట్రో పరుగులు

భాగ్యనగరంలో మెట్రో రైలు పట్టాలెక్కే మూహుర్తం ఖరారైంది. నవంబర్ నెలలో ప్రధాని చేతుల మీదుగా మోట్రో రైలు ప్రారంభించాలని టి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్  గురువారం లేఖ రాశారు.

Last Updated : Sep 7, 2017, 04:02 PM IST
నవంబర్‌లో హైద్రాబాద్ మెట్రో పరుగులు

హైదరాబాద్: భాగ్యనగరంలో మెట్రో రైలు పట్టాలెక్కే మూహుర్తం ఖరారైంది. నవంబర్ నెలలో ప్రధాని చేతుల మీదుగా మోట్రో రైలు ప్రారంభించాలని టి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్  గురువారం లేఖ రాశారు.

వాస్తవానికి వచ్చే ఏడాది జనవరి నాటికి హైద్రాబాద్ మెట్రో రైలు ప్రారంభించాలని భావించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గోనేందుకు నవంబర్ చివరివారంలో  ప్రధాని మెడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్సంలోనే మెట్రో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టాలని టి.సర్కార్ రంగం సిద్ధం చేసింది. నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభించాలని భావిస్తున్న సర్కార్ ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

మొత్తం రూ.15 వేల కోట్ల వ్యయంతో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మూడు కారిడార్లలో మొత్తం 72 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. మొదటి దశలో మియాపూర్ అమీర్ పేట రూట్ లో 13 కి.మీ. అమీర్ పేట- నాగోల్ రూట్ లో 17 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ఈ మర్గాల్లో స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తియింది. ట్రయల్ రన్ కూడ విజయవంతంగా కొనసాగుతోంది. భద్రతా పరమైన అనుమతులు కూడా వచ్చాయి. వసతులకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. మొత్తం 30 కి.మీ మేర మొదటి దశ మెట్రో రైలును ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని టి.సర్కార్ యోచిస్తోంది. ఈ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రధాని మోడీని ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వార ఈ విషయాన్ని తెలియజేశారు. 

Trending News