దాదాపుగా ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పున:ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించగా దేశంలో మెట్రో రైలు సేవల్ని నిలిపివేశారు. అన్‌లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు (Hyderabad Metro Rail New Timings) అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రయాణానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలు (Hyderabad Metro New Guidelines)విడుదల చేసింది. Gold Price: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త
గ్రెడెడ్ పద్ధతిలో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్ని తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 7న కారిడార్-1, 8న కారిడార్-3, సెప్టెంబరు 9నుంచి అన్ని మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. కంటైన్మెంట్ జోన్లలోని మెట్రో స్టేషన్లను ప్రస్తుతానికి తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం ముఖ్యమని ప్రయాణికులను హెచ్చరిస్తోంది. మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్
హైదరాబాద్ మెట్రో రైలు మార్గదర్శకాలు, కుదించిన సమయం వివరాలు.. (Hyderabad Metro New Guidelines)
- తొలి విడతలో భాగంగా సెప్టెంబర్ 7న కారిడార్-1 (మియాపూర్ - ఎల్బీ నగర్) మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అయితే ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గం. నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉంటుంది.
- రెండో విడతలో భాగంగా సెప్టెంబర్ 8న కారిడార్-3 (నాగోల్- రాయదుర్గ్) ఏరియాలో మెట్రో ప్రారంభం అవుతుంది. అయితే ఉదయం 7 గం. నంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గం. నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కారిడార్‌లో రైళ్లు నడుస్తాయి.
- మూడో విడతలో భాగంగా సెప్టెంబర్ 9 నుంచి నగరంలో అన్ని మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఉదయం 7 గం. నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే!
- మెట్రో స్టేషన్లలో భౌతిక దూరం పాటించాలి. లేనిపక్షంలో ఆ ప్రయాణికులపై చర్యలు తీసుకుంటారు. సీసీటీవీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు.
- మెట్రో స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేకపోతే జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోనున్నారు.
- మెట్రో రైలు ఉద్యోగులు, సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహించాలి.
- టికెట్లను నగదు రూపంలో కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధించారు. క్యాష్ లెస్, స్మార్ట్ కార్డుల రూపంలో టికెట్లు విక్రయిస్తారు.
- కంటైన్మెంట్ జోన్లలోని మెట్రో స్టేషన్లను ప్రస్తుతానికి తెరవకూడదని నిర్ణయం.
- యూసఫ్‌గూడ, ముషీరాబాద్, గాంధీ హాస్పిటల్, మూసాపేట, భరత్ నగర్ మెట్రో స్టేషన్లు మరికొంత మూసివేయాలని నిర్ణయం. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics