Platform Ticket Rate Hiked: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్‌లో రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
సంక్రాంతి పండగ కారణంగా రైల్వే స్టేషన్‌లో రద్దీ విపరీతంగా పెరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రయాణికులకు తోడు.. వారి వెంట వచ్చేవారితో స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటోందని తెలిపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను పెంచినందునా రద్దీని కొంతమేరకు నియంత్రించవచ్చునని రైల్వే శాఖ భావిస్తోంది.
గతేడాది కరోనా సెకండ్ వేవ్ సమయంలో రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను ఏకంగా రూ.50కి పెంచిన సంగతి తెలిసిందే. కరోనా పీక్స్‌కి చేరడంతో రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక టికెట్ ధరను తగ్గించింది.
సాధారణంగా పండగల సమయంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ కామన్. ముఖ్యంగా సంక్రాంతి, దసరా పండగల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. నగరాలు, పట్టణాల నుంచి చాలా కుటుంబాలు పల్లె బాట పడుతాయి. పండగ సమయంలో ఎంత రద్దీ ఉంటుందో.. పండగ ముగిశాక జనం మళ్లీ సిటీ బాట పట్టే సమయంలోనూ అంతే రద్దీ ఉంటుంది. ప్రస్తుతం కరోనా (Covid 19 Cases in India) వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook