Summer Weather: సూర్యుడు తెలంగాణపై ప్రతాపం చూయిస్తున్నాడు. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండగా.. రాత్రిళ్లు వేడిగాలులు వీస్తున్నాయి. ఇదే క్రమంలో మరింత ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయని తెలిపింది. తెలంగాణ వాతావరణ శాఖ కార్యాలయం 'వాతావరణ' అప్డేట్ ఇచ్చింది.
Also Read: Family Star: విజయ్ దేవరకొండనే టార్గెట్.. ఫేక్ న్యూస్‌పై 'ఫ్యామిలీ స్టార్' టీమ్ పోరాటం
ఆ శాఖ నివేదిక ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను కూడా తెలిపింది.
Also Read: Klin Kaara: గుండు చేయించుకున్న రామ్‌చరణ్ కుమార్తె క్లీంకార.. ఎందుకంటే?
వాతావరణ విశ్లేషణ (సోమవారం ఉదయం 8:30 గంటల ఆధారంగా):
తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయి. దీని కారణంగా కొంత ఎండల నుంచి ఉపశమనం లభించనుంది.
రాగల 3 రోజుల వాతావరణ సూచన
- ఎండల వేడితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో వర్షాలు పడుతాయని తెలిపింది.
- సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది అని ప్రకటించింది.
వాతావరణ హెచ్చరికలు
- రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
- సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులు వీస్తాయి. దీంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి