Water Supply Shutdown: జంటనగరాల్లో 36 గంటల పాటు నీళ్లు బంద్, నీటి సరఫరా ఆగిపోనున్న ప్రాంతాలివే

Water Supply Shutdown: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఇది బ్యాడ్‌న్యూస్. 36 గంటలు వాటర్ సప్లై ఆగిపోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ ప్రకటించిందాని ప్రకారం ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగనుందో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2022, 10:52 PM IST
Water Supply Shutdown: జంటనగరాల్లో 36 గంటల పాటు నీళ్లు బంద్, నీటి సరఫరా ఆగిపోనున్న ప్రాంతాలివే

Water Supply Shutdown: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఇది బ్యాడ్‌న్యూస్. 36 గంటలు వాటర్ సప్లై ఆగిపోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ ప్రకటించిందాని ప్రకారం ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగనుందో చూద్దాం..

జంట నగరాల ప్రజలకు బ్యాడ్‌న్యూస్. ఆగస్టు 16వ తేదీ ఉదయం 6 గంటల్నించి డ్రింకింగ్ వాటర్ సప్లై ఆగిపోతుంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రోపాలిటల్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డ్ ప్రకటించింది. ఫలితంగా నగరంలో 3.5 లక్షల మందిపై ప్రభావం పడనుంది. కృష్ణా నది వాటర్ సప్లై అవుతున్న ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోనుందని HWSSB వెల్లడించింది.

ఫలక్‌నుమా ప్రాంతంలోని అల్ జుబైల్ కాలనీలో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా మీరాలం అలియాబాద్  పైప్‌లైన్స్ షట్‌డౌన్ వల్ల వాటర్ సప్లై అగిపోనుంది. 

వాటర్ సప్లై అగనున్న ప్రాంతాలివే

మీరాలం, కిషన్‌బాగ్, అల్ జబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ సాగర్, సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గఢ్, యాకుత్ పురా, మాదన్నపేట్, మహబూబ్ మేన్షన్, రియాసత్ నగర్, అలియాబాద్, బాలాపూర్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివమ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్ నగర్, బొంగులూర్, మన్నెగూడ

వాటర్ సప్లై పాక్షికంగా నిలిచిపోనున్న ప్రాంతాలు

మెహదీపట్నం, కార్వాన్, లంగర్‌హౌస్, కాకతీయనగర్, హమయూన్ నగర్, తల్లాగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఈఎస్, షేక్‌పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, భోజగుట్ట, చింతల్ బస్తి, ఆళ్లబండ, జియాగూడ, రెడ్‌హిల్స్, సెక్రటేరియట్, ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్, గగన్ మహల్, హిమాయత్ నగర్, బద్వేల్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, ఉప్పరపల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, చింతల్‌మెట్, కిషన్‌బాగ్, మణికొండ, గంధంగూడ, నార్శింగి, కిస్మత్‌పూర్, బాలాపూర్, మైసారం, బండ్లగూడ, బర్కాస్, మేకలమండి, భోలక్‌పూర్, తార్నాక,లాలాపేట్, బౌధ్దనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూమ్, రైల్వేస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగూడ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్,  తాటిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి, సైనిక్‌పురి, మౌలాలి, స్నేహపురి, కైలాస్‌గిరి, దేవేంద్రనగర్, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, మధుబన్, దుర్గానగర్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, మల్లికార్జున నగర్, మానిక్‌చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, కిస్మత్ పూర్, ధర్మశాయి 

ఇలా కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై అగిపోనుందని HWSSB ప్రకటించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ట్యాంకర్లు సరఫరా చేయనున్నామని HWSSB తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని..నీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. జంటనగరాల్లో ఆగస్టు 16 ఉదయం నుంచి తాగునీటి సరఫరా బంద్ అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Also read: Munugode Trs: మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్.. టికెట్ రేసులో కర్నె, కంచర్ల? అసమ్మతి స్వరంతో కూసుకుంట్ల అవుట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News