Huzurabad bypolls candidates: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ

Huzurabad bypolls candidates list: మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 19 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన అనంతరం వివిధ కారణాలతో తిరస్కరించారు. మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2021, 07:20 AM IST
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు మొత్తం 61 మంది నామినేషన్స్ దాఖలు
  • అంతిమంగా ఖరారైన 30 మంది అభ్యర్థులు
  • నామినేషన్స్ ఉపసంహరించుకున్న వారిలో ఈటల సతీమణి జమున
Huzurabad bypolls candidates: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ

Huzurabad bypolls candidates list: హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. ఈ ముప్పై మందిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉండగా... మరో ఏడుగురు అభ్యర్థులు ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 19 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన అనంతరం వివిధ కారణాలతో తిరస్కరించారు. మరో 12 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. 

హుజూరాబాద్‌ ఎన్నికల అధికారి రవీందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈటల రాజేందర్‌ సతీమణి జమున (Eetala Rajender's wife Jamuna), కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, కొల్గూరి రాజకుమార్‌, వినోద్‌ కుమార్‌, ఇమ్మడి రవి, వెంకటేశ్వర్లు, రేకుల సైదులు, రవీందర్‌, వరికొలు శ్రీనివాస్‌, నూర్జహాన్‌ బేగం, గుర్రం కిరణ్‌, మల్లికార్జున్‌‌లు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. 

Also read : TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

ఈ ఉప ఎన్నికలో ప్రధాన అభ్యర్థులుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ (Gellu Srinivas Yadav), బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (Eetala Rajender), కాంగ్రెస్‌ నుంచి ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట నరసింగ రావు బరిలో (Balmoori Venkata Narsinga Rao) నిలిచారు.

Also read : Huzurabad bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి Kanhaiya Kumar, Hardik Patel !

Also read : Gangula Kamalakar Tested Positive: కరోనా బారినపడ్డ మరో తెలంగాణ మంత్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News