Hyderabad Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసిముద్దైంది. వరద నీరు రోడ్లపైకి చేరుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో కుండపోతగా వర్షం కురవకున్నా సరాసరి 4 సెంటిమీటర్ల వర్షపాతం రోజూ నమోదవుతోంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని నాలాలన్ని పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు భారీగా రావడంతో హుస్సేన్ సాగర్ నిండిపోయింది. హుస్సేన్ సాగర్ ఎఫ్ టీఎల్ లెవల్ కు చేరడంతో అధికారులు అప్రమత్తయ్యారు. హుస్సేన్ సాగర్ కు గతంలో ఏర్పాటు చేసిన గేటు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్ టిఎల్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతం 513.45 అడుగులుగా నీటి మట్టం ఉంది. గ్రేటర్ పరిధిలో వర్షాలు కంటిన్యూ అవుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మారియట్ హోటల్ మరియు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వైపు ఉన్న రెండు అలుగుల ద్వారా వరదనీరు మూసి లోకి వెళుతుంది. అటు జంట జలాశయాలు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి వరదను మూసీలోకి వదిలారు.
ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉండగా.. రెండు గేట్లను ఒక ఫీట్ మేర ఎత్తి 312 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ సామర్ద్యం 3.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.01 టీఎంసీల నీరు ఉంది. హిమాయత్ సాగర్ కు వరద వస్తుండటంతో రెండు గేట్లు ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్ కు 5 వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 515 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. హిమాయత్ సాగర్ పూర్తి సామర్ధ్యం 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.37 టీఎంసీల నీరు ఉంది.
గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. మరో రెండు రెండు మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.మాన్ సూన్ బృందాలను రంగంలోకి దింపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి పిలుపు ఇచ్చింది. కరెంట్ పోల్స్ దగ్గర, చెట్ల కింద, నాలాల పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరు నిలబడవద్దని జిహెచ్ఎంసి కమిషనర్ సూచించారు. ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని నగర మేయర్ విజయలక్ష్మి చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 93 మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు, 14 మినీ మాంసం ఎమర్జెన్సీ టీములు పనిచేస్తున్నాయని GHMC వెల్లడించింది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తంగా 14 వందల 20 మంది వర్షాకాలంలో పనిచేస్తున్నారని తెలిపింది.
Read also: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేసీఆర్ డేట్ ఫిక్స్ చేసేశారా?
Read also: Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook