Traffic Jam: హైవేలు జామ్.. టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్..

Traffic Jam: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అతిపెద్ద పండగ అయిన దసరా పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లిన వాళ్లు నిన్న సాయంత్రం నుంచి భాగ్యనగరానికి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవే జాతీయ రహదారిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 14, 2024, 10:53 AM IST
Traffic Jam: హైవేలు జామ్.. టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్..

Traffic Jam:బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ముగియడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని  గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్‌ నగర  బాటపట్టారు. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో తిరుగు ప్రయాణం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలు విజయవాడ-హైదరాబాద్ హైవే పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

కరీంనగర్- హైదరాబాద్ రాజీవ్ రహదారి దుద్దెడ టోల్ ప్లాజా వద్ద కూడా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న వాహనాలతో గూడూరు టోల్ ప్లాజా వద్ద అదే పరిస్థితి అదే దుస్థితి నెలకొంది.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

అద్దంకి, నార్కట్ పల్లి రహదారి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్‌తో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజా నిర్వాహకులు, స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో చెమటోడుస్తున్నారు. అదే విధంగా రైల్వే స్టేషన్స్‌, బస్టాండ్‌లలో రద్దీగా ఉంది. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా జనం తరలివస్తుండటంతో లక్డీకాపూల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంబించింది.

మొత్తంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫాస్ట్ ట్యాగ్ వల్ల కొంతలో కొంత ట్రాఫిక్ జామ్ తగ్గినట్టు తెలుస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర ఉండే ఇరుకైన రహదారి గుండా ప్రయాణించాల్సిన కారణంగా వేగంగా వచ్చే వాహనాలు అక్కడ నెమ్మదిగా కదులుతూ ముందుగా సాగుతున్నాయి. ఒకేసారి భారీగా వాహనాలు రావడంతో జాతీయ రహదారులకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నెలకొంది.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News