Honey Bees Attacked On Mla Rajaiah: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ఉప్పుగల్లు గ్రామంలో రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలో బోనం సమర్పించారు ఎమ్మెల్యే రాజయ్య. బోనం సమర్పించేందుకు దేవస్థానంలోకి వెళ్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా గుంపులుగా వ్యాపించాయి. తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో భక్తులతోపాటు ఎమ్మెల్యే రాజయ్య కూడా పరుగులు పెట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రాజయ్య సిబ్బంది.. ఆయనను కారులోకి తీసుకుని వెళ్లారు. వివరాలు ఇలా..
ఉప్పుగల్లు వద్ద సోమవారం జరిగిన బోనాలు ఉత్సవాలకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. బోనం సమర్పించేందుకు ఆయన దేవస్థానంలోకి అడుగు పెట్టగా.. పండుగలో భాగంగా వచ్చే భక్తులు దివిటీలను వెలిగించారు. సాధారణంగానే ఆ ప్రాంతంలో తేనెటీగలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ మంటల వేడికి అక్కడున్న వారిపై అవి తేనెటీగలు దాడికి దిగాయి. ఆ దాడిలో కొందరు స్వల్ప గాయాల పాలయ్యారు. వాటి దాడి నుంచి ఎమ్మెల్యే రాజయ్య మాత్రం క్షేమంగా బయటపడ్డారు. దేవస్థాన సిబ్బంది తేనెటీగలను పొగ పెట్టి తరిమేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలపాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇక ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన సంచలన ఆరోపణలు ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాశంగా మారాయి. తనను ఎమెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నారని.. తమ గ్రామానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ ఆరోపణలను రాజయ్య మొదట ఖండించారు.
అయితే అధిష్టానం ఆదేశాల మేరకు రాజయ్య దిగి వచ్చారు. జానకీపురం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడారు. తన వల్ల ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. తాను ఏ గ్రామం పట్ల వివక్ష చూపించలేదని.. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం జానాకీపురం గ్రామానికి 25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం నవ్య మాట్లాడుతూ.. చెడు జరిగితే తాను ఖండిస్తానని అన్నారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమన్నారు. తాను రాజయ్య వల్లే సర్పంచ్‌గా గెలిచానని గుర్తు చేసుకున్నారు.
Also Read: Dogs Attack on Boy: తెలంగాణలో దారుణం.. కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్ ఏర్పాటుకు కారణం ఆయనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook