5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థలో మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సారథ్యంలో ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో గణనీయమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మూసీ నదిపైన, ఈసానదిపైన వంతెనల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది.
మూసి, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు (వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా (కోవిడ్) వల్ల రెండు సంవత్సరాల పాటు ఎదురైన పరిస్థితుల కారణంగా మూసి, ఈసా నదులపై వంతెనల నిర్మాణ కార్యాచరణలో జాప్యం జరుగుతూ వచ్చింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు (3) చోట్ల, ఈసానదిపై రెండు (2) చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ముందడుగు పడింది.
సుమారు రూ.168 కోట్ల వ్యయంతో ఐదు (5) వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండిఏ ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రోక్యుర్మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.
హెచ్ఎండిఏ నిర్మించే ఐదు వంతెనల వివరాలు ఇలా ఉన్నాయి :
1 ) రూ.42 కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద ,
2 ) రూ.35 కోట్లతో ప్రతాప సింగారం - గౌరెల్లి వద్ద ,
3 ) రూ.39 కోట్లతో మంచిరేవుల వద్ద ,
4 ) రూ.32 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై ,
5 ) రూ.20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనల నిర్మాణాలను చేపట్టనుంది.
ఉప్పల్ భగాయత్, ప్రతాప సింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున మూసిపై నాలుగు వరుసల (ఫోర్ లైన్) వంతెన నిర్మాణం జరుగనుంది. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయినందున మంత్రి కేటీ రామారావు రేపు సోమవారం 25వ తేదీన ఆయా వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఐదు వంతెనల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బ్రిడ్జిల నిర్మాణ పనులను 15 నెలల గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దాదాపు ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ అన్ని వంతెనల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు, వాహన చోదకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ధృఢసంకల్పంతో ఉన్నట్టు హెచ్ఎండిఏ ప్రకటించింది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ప్రయాణం మరింత సులభతరం కానుంది. నిర్మాణాలు చేపట్టిన అన్ని మార్గాల్లోనూ ప్రయాణదూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.
ఇది కూడా చదవండి : Vande Bharat Express: ఒక్క రోజులో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చు.. 'వందే భారత్' ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి
ఉదాహరణకు ప్రతాప సింగారం - గౌరెల్లి మధ్య పాతకాలం నాటి బ్రిడ్ది నిర్మాణం తక్కువ ఎత్తులో ఉండటంతో ఇక్కడ మూసి నది పొంగిపొర్లితే వాహనాల రాకపోకలు నిలిచిపోతుంటాయి. ప్రతాప సింగారం - గౌరెల్లి పక్కపక్కనే ఉన్నప్పటికీ.. మూసీ నది కారణంగా మరో 30 కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కానీ ఈ బ్రిడ్ది అందుబాటులోకి వస్తే ఆ తిప్పలు తప్పుతాయి. అలా వంతెనల నిర్మాణాలు చేపడుతున్న అన్ని మార్గాల్లోనూ ఇలాంటి సౌకర్యమే కలగనుంది. ఉద్యోగరీత్యా, ఉపాధిరీత్యా నిత్యం ఆయా మార్గాల్లో ప్రయాణించే నగరవాసులకు ఈ కొత్త బ్రిడ్జిల నిర్మాణం ఎంతో ఊరటనివ్వనుంది. అంతేకాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకి సమీప ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తోన్న ఈ నిర్మాణాలు హైదరాబాద్ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి.
ఇది కూడా చదవండి : Hyderabad Metro Rail: జస్ట్ రూ. 59తో హైదరాబాద్ మెట్రోలో ఇక అన్‌లిమిటెడ్ ట్రావెలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
5 More New Bridges In Hyderabad: రూ.168కోట్లతో హైదరాబాద్‌లో కొత్తగా మరో 5 బ్రిడ్జిలు