AIMIM: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఎంఐఎం కార్యకర్తలు.. అకారణంగా దాడి..

AIMIM: హైదరాబాద్ లో మరోసారి  ఎంఐఎం కార్యకర్తలు రెచ్చిపోయారు. గతంలో పలుమార్లు అమాయకులతో పాటు ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడ్డ సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బజార్ ఘాట్ లో లోని ఓ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు గూండాల్లా  అకారణంగా విరుచుకుపడ్డ ఘటన సంచలనం రేపుతోంది.    

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 13, 2024, 09:30 AM IST
AIMIM: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఎంఐఎం కార్యకర్తలు..  అకారణంగా దాడి..

AIMIM:హైదరాబాద్ లోని నాంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్న బజార్ ఘాట్ లోని ప్లెజెంట్ అపార్ట్ మెంట్ వాసులపై ఎంఐఎం కార్యకర్తలు, వారి మద్దతుదారులు రెచ్చిపోయారు. అంతేకాదు అపార్ట్ మెంట్ లో ఉంటున్న మహిళలను యువకులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు.  అంతేకాదు అడ్డు వచ్చినవారిపై విరుచుకు పడ్డారు. అంతేకాదు అక్కడున్న మహిళలను, యువకులను చంపుతానంటూ బెదిరించారు. ఈ దాడిలో ఎంఐఎం మాజీ కార్పోరేటర్ సుభాన్ నజ్రుల్లా, ఎంఐఎం మద్దతుదారు సనాబేర్ తో పాటు వారి మద్దతు దారులున్నారు.

అపార్ట్మెంట్ ముందుభాగంలో ఆక్రమణల తొలగింపు విషయంలో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ సందర్బంగా అపార్ట్మెంట్ లోకి చొచ్చుకువచ్చిన ఎంఐఎం మద్దతుదారులు అక్కడున్న మహిళలు, యువకులపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఎంఐఎం మద్ధతుదారులు, అపార్టమెంట్ వాసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వారినీ పోలీసులు శాంతింప చేసారు. అంతేకాదు వారిని  నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

అయితే.. ఇందులో అపార్ట్ మెంట్ వాసుల తప్పు ఏమి లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అపార్టెంట్ ను ఆనుకొని ఉన్న వాళ్ల స్థలంలో కొంత మంది  ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ విషయమై అపార్ట్ మెంట్ వాసులు వారిని నిలదీసేవరకు వాళ్లకు మద్దతుగా ఒక్కసారిగా ఎంఐఎం కార్యకర్తలు అపార్ట్ మెంట్ వాసులపై దాడికి తెగపడ్డారు. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని కొంత మంది చెబుతుంటే.. ఇక్కడ గొడవ పెద్ది కాకుండా.. తామే చొరవ తీసుకొని ఇరు వర్గాలను శాంతింప చేసామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ నగరంలో ఎంఐఎం కార్యకర్తులు జరిపిన  ఈ గొడవ ఇపుడు చర్చనీయాంశంగా మారింది.   అంతేకాదు పలు సందర్బాల్లో ఎంఐఎం కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న సందర్భాలున్నాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ గవర్నమెంట్,  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎంఐఎం ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వీరి ఆగడాలను ప్రభుత్వ పెద్దలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గం మెప్పుకోసం  చూస్తూ ఉండిపోయారే తప్పించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు సోషల్ మీడియా వేదికగా  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  

Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News