Gorakshak Dal Attacked: హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత.. గోరక్షకులపై కత్తులతో దాడి..!!

High Tension at Karmanghat in Hyderabad: హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో  గోరక్షక్ దళ సభ్యులపై దాడి జరిగింది. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దుండగులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 12:49 PM IST
  • హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత
  • గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న గోరక్షక్ సభ్యులు
  • గోరక్షక్ సభ్యులపై దాడి
Gorakshak Dal Attacked: హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత.. గోరక్షకులపై కత్తులతో దాడి..!!

High Tension at Karmanghat in Hyderabad: హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా గోవులను తరలిస్తున్న ఓ బొలెరో వాహనాన్ని గోరక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. గోరక్షక్ సభ్యులు ఇన్నోవా వాహనంలో బొలెరో వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్నోవా వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.

బొలెరో వాహనంలో గోవులను తరలిస్తున్న వ్యక్తులు ఇన్నోవా వాహనంపై దాడి చేసి.. అందులోని గోరక్షక్ సభ్యులపై కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గోరక్షక్ సభ్యులు భయంతో సమీపంలోని ఓ ఆలయంలోకి పరుగులు తీశారు. దుండగులు అక్కడికి కూడా కత్తులతో వచ్చి దాడి చేసినట్లు గోరక్షక్ సభ్యులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. 

దాడి విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోవుల అక్రమ రవాణా సమాచారంతో స్వయంగా రంగంలోకి దిగి దుండగులను పట్టుకున్న సంగతి తెలిసిందే. గోవులను అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో రాజాసింగ్ హైదరాబాద్ పోలీసులను డిమాండ్ చేశారు. 

Also Read:  నెరవేరిన సుక్కూ కల.. మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయనున్న లెక్కల మాష్టారు.. ట్విస్ట్ ఏంటంటే...  

Also Read: Purchased Land On Moon: చంద్రుడిపై భూమి కొనేశాడు.. చౌక భేరం.. ఎకరం 6 వేలకే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News