BJP Corporators Protest at GHMC office: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ (Telangana BJP) కార్పోరేటర్లు, కార్యకర్తలు కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. మేయర్ ఛాంబర్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జీహెచ్ఎంసీ (GHMC) పాలకమండలి కొలువుదీరి దాదాపు ఏడాది కావొస్తున్నా ఎలాంటి అభివృద్ది పనులు జరగట్లేదని బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. కొన్నిచోట్ల అభివృద్ది పనులకు బిల్లులు మంజూరు చేసినా.. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకూ డబ్బులు చెల్లించలేదన్నారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్, కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉన్నా.. ఇప్పటివరకూ అవేవీ జరగలేదన్నారు. కనీసం మేయర్ (Mayor Gadwal Vijayalakshmi) తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదని ఆరోపించారు. మేయర్, టీఆర్ఎస్ కార్పోరేటర్ల అవకతవకలు బయటపడుతాయనే సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపించారు. అసలు మేయర్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: దివంగత కర్నల్ సంతోష్‌బాబుకు 'మహావీర్ చక్ర' పురస్కారం
మేయర్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇప్పటికైనా మేయర్ స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత కొద్ది నెలలుగా బీజేపీ కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద తరచూ నిరసనలకు దిగుతూనే ఉన్నారు. చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను ఆమోదించారంటూ గతంలో మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజుల క్రితం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని బీజేపీ కార్పోరేటర్లు (Telangana BJP) వాపోతున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అంటున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులను ఆపేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, అధికారులు కార్పోరేటర్లను గుర్తించట్లేదని వాపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook