Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు, ఏయే జిల్లాల్లో రెడ్ అలర్ట్

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై భారీగా కన్పిస్తోంది. రెండ్రోజుల్నించి కురుస్తున్న వర్షాలకు తోడు ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. అందుకే మూడ్రోజులపాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2023, 11:04 AM IST
Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు, ఏయే జిల్లాల్లో రెడ్ అలర్ట్

Heavy Rains Alert: తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడటంతో ఆ ప్రభావం తెలంగాణ జిల్లాలపై గట్టిగా కన్పిస్తోంది. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ సూచిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో గత రెండ్రోజుల్నించి తెలంగాణలో మోస్తరు వర్షాలు కురస్తున్నాయి. ఇప్పుడీ ఆవర్తనం అల్పపీడనంగా బలపడటంతో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 

ఇక జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల , వికారాబాద్, వరంగల్ , హనుమకొండ జిల్లాల్లోకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 

మరోవైపు నిన్న అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. దాంతో హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ ప్రకటితమైంది. మరో మూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో మూడ్రోజులు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

Also read: CWC Meeting in Hyderabad: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంనాడే హైదరాబాద్‌లో కాంగ్రెస్ CWC భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News