Hyderabad Rains: హైదరాబాద్(Hyderabad) లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వెస్ట్ హైదరాబాద్ లో భాగం అయిన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ లో భారీ వర్షం కురిసింది. అటు ఎస్సాఆర్ నగర్, అమీర్ పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, రహమత్ నగర్, కృష్ణ నగర్ లో జోరుగా వాన కురిసింది.
అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, కవాడిగూడ, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బర్కత్ పుర, బషీర్ బాగ్ లో వర్షం దంచికొట్టింది.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇటు అసలు సిసలు హైదరాబాద్ అయిన పాతబస్తీ పరిసర ప్రాంతాలైన చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణ గుట్ట, ఫలక్‌నుమా, యాకుత్‌పురా, దారుల్ షిఫా, అలియాబాద్‌లో కురిసిన వర్షాలకు ప్రజలు తడిసి ముద్దయ్యారు. భారీ వర్షం నేపథ్యలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్డల మీదికి నీరు చేరి ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడింది. అటు తూర్పు హైదరాబాద్ ప్రాంతమైన హబ్సిగూడ, ఉప్పల్, ఎల్ బీ నగర్ , మల్లా పూర్, ఏ.ఎస్. రావు నగర్, చర్ల పల్లి, హయత్ నగర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.