Heavy Rains: తెలంగాణ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రోడ్లపై వరద నీరు చేరుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పల్లపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలపై పడుతోంది.
రుతు పవనాలు, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని పల్లపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రోడ్లపై వరద నీరు వచ్చి చేరుతోంది. బారీగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో..ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా పల్లపు ప్రాంతాలైన కూకట్‌పల్లి, హైదర్ నగర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, సూరారం, సికింద్రాబాద్, దుండిగల్, బోయిన్‌పల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, అల్వాల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, నేరేడ్‌మెట్, కాప్రా వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది.రోడ్లపై వర్షం నీరు చేరకుండా..జీహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగి..ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తుండటంతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై ప్రభావం కన్పిస్తోంది. సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also read: TRS BIKE RALLY: భాగ్యలక్ష్మి ఆలయానికి యోగీ.. చార్మీనార్ దగ్గర హై టెన్షన్.. టీఆర్ఎస్ ర్యాలీకి బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook