Unseasonal Rains in Telangana: నిన్న మెున్నటి వరకు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన జనానికి వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. అయితే అతడు కురిపించిన అకాల వర్షం తెలంగాణ రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ వర్ష బీభత్సానికి ధాన్యం తడిసి ముద్దయింది. అమ్మడానికి సిద్దంగా ఉన్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం ధాటికి జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూరు, బుగ్గారం మండలాల్లో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగు పాటుకు జగదేవపేటలో రాజయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. సిరికొండలో రెండు మేకలు మృతి చెందాయి.
తెలంగాణ వ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వరణుడు విధ్వంసానికి నగరంలోని చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పడిపోయిన చెట్లను తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలను మేయర్ పరిశీలించారు. అంతేకాకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. బొజ్జానాయక్ తండాలో పిడుగుపాటుకు ఓ రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండ జిల్లాలో వరి, మెుక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుకుంటున్నారు. ములుగు జిల్లాలో కూడా ఊదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి