KCR 1k Acre Farm House: రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించింది' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు రూ.15 వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండిచెయ్యి చూపారు' అని వాపోయారు.
Also Read: BRS Party: తెలంగాణ తల్లికి కిరీటం తీసేస్తే దేవుళ్లకు కూడా కిరీటం తీస్తారా?
మహబూబ్‌నగర్ సభలో రైతుల పండుగ పేరిట నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి, మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా 'ఎక్స్'లో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పాలమూరు సభలో కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారు' అని ఆరోపించారు.
Also Read: KTR Break: 'నేను రెస్ట్ తీసుకుంటా.. ఇక చెల్లి, బావ మీరు తగులుకోరి': కేటీఆర్
'కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు' అని హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాదు.. మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 'మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి?' అని ప్రశ్నించారు.
'రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే.. గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే కనిపించింది' అని రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. 'అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నానని చెప్పి పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నావు. పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా?' అని ప్రశ్నించారు. 'ఒకసారి ఫార్మాసిటీ అని గెజిట్ ఇచ్చి బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటమైతే అటు మాట్లాడటం నీకే చెల్లింది' అంటూ ఎద్దేవా చేశారు.
'మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టులు చేసి జైలుకు పంపించావు. ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కార్చుతున్నావు' అని రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రుణమాఫీ చేస్తానని నూటొక్క దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు' అని గుర్తుచేశారు.
'ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి?' అని మాఈ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ' కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్ధమా? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా?' అంటూ సవాల్ చేశారు. 'అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి. మేము ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాం. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయటపెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా?' అని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter