New Ration Card: కొత్తరేషన్ కార్డుకు అప్లై చేసినవారికి గుడ్‌న్యూస్..  జూన్ నుంచి మంజూరు..!

New Ration Card: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ ముగియడంతోపాటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్‌ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 11, 2024, 09:06 AM IST
New Ration Card: కొత్తరేషన్ కార్డుకు అప్లై చేసినవారికి గుడ్‌న్యూస్..  జూన్ నుంచి మంజూరు..!

New Ration Card: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ ముగియడంతోపాటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్‌ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌ న్యూస్ చెప్పింది రేవంత్‌ సర్కార్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీల అన్నింటికీ రేషన్ కార్డులు తప్పనిసరి చేశారు. అయితే, రేషన్ కార్డులు లేని వారికి ఇబ్బందిగా మారింది. ప్రజాపాలనలో భాగంగా దాదాపు 90 లక్షల మందికి పైగా కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం లోక్‌ సభ ఎన్నికల కోడ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ ఆలస్యం కానుంది. అయితే, సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా జూన్‌ నెల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు రేవంత్ సర్కార్‌ చెప్పింది.

ఇదీ చదవండి: తెలంగాణ లోకసభలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న సంచలన సర్వే..

ఈ జనవరితోనే సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయింది. లోక్‌ సభ ఎన్నికల తర్వాత సర్పంచ్‌ ఎన్నికలను కూడా నిర్వహించనున్నారు. గ్రామంలో ఉన్న ఓటు బ్యాంకును తిరిగి సంపాదించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నవారిలో పదిలక్షల మంది అర్హులని తేలింది. అందులో ఆదాయ ధృవీకరణర పత్రంతోపాటు డోర్ టూ డోర్ వెళ్లి వారు వైట్ రేషన్ కార్డు పొందడానికి సదరు లబ్దిదారులు అర్హులేనా అని ఎంక్వైరీ చేస్తారు. కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలతో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. 

ఇదీ చదవండి: కంటోన్మెంట్‌పై కేసీఆర్‌ సంచలన నిర్ణయం.. ఆమెకే టికెట్‌.. అతడికి భారీ షాక్‌

ఈ కొత్తరేషన్ కార్డుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు కూడా లబ్ది పొందుతారు. అయితే, కేవలం ఇంటి పెద్ద మాత్రమే కాదు కార్డులో ఎవరు ఉన్న వారు అర్హులవుతారు. వైట్‌ రేషన్ కార్డు ద్వారా మహిళలకు రూ. 2,500 మంజూరుకు కూడా ఈ కొత్త రేషన్‌ కార్డుల ద్వారా సులభతరం అవుతుంది. ఈ రేషన్ కార్డుల జారీ మూడు దశలుగా జరగనుంది. కొత్త రేషన్‌ కార్డులు పొందిన తర్వాత అయినా ఉచిత కరెంటు, రూ. 500 గ్యాస్‌ లబ్ది పొందవచ్చని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నవారు కూడా ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News