మోదీజీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ఉపాసన

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆ ఒక్కరోజు సమాజాన్ని ప్రభావితం చేసే మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు అందిస్తానని తన ట్వీట్‌లో ప్రధాని మోదీ వెల్లడించారు. 

Last Updated : Mar 4, 2020, 09:50 AM IST
మోదీజీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి: ఉపాసన

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీగారూ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. భారత్‌ను మరింత మెరుగైన దేశంగా ఎలా తీర్చిదిద్దాలో తెలిపేందుకు తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరుతూ ట్వీట్ చేశారు. యువతకు ఈ విషయంపై అవగాహన కల్పించడానికి, అతి తక్కువ ఖర్చులో ఆరోగ్యవంతమైన దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఈ ఛాన్స్ ఉపకరిస్తుందన్నారు ఉపాసన. భారత్‌లో ఆరోగ్యవంతంగా ఎలా జీవించవచ్చో ప్రపంచానికి చాటి చెప్పాలని తాను కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. జై హింద్, #sheinspiresus అని ఉపాసన పోస్ట్ చేశారు.

Also Read: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాములో రాముల’ వీడియో సాంగ్

‘నేను అల్లోపతి ట్రీట్ మెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా తాత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తర్వాతి తరాలకు ఆరోగ్యాన్ని ఎలా అందించారో నేర్పించారు. ఆయూష్ లాంటి వాటితో చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్య విధానాలతో మన దేశ ప్రజలకు ఆరోగ్యం అందించవచ్చునని ప్రధాని మోదీ ట్వీట్‌పై ఉపాసన స్పందించారు.

Also Read: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ 

కాగా, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇదివరకే ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని.. ఆ ఒక్కరోజు సమాజాన్ని ప్రభావితం చేసే మహిళలకు తన సోషల్ మీడియా అకౌంట్లు అందిస్తానని తన ట్వీట్‌లో ప్రధాని మోదీ వెల్లడించారు. 

కోట్లాది ప్రజలలో దీనివల్ల స్ఫూర్తి రగిలే అవకాశం ఉందన్నారు. మీరు అలాంటి గొప్ప మహిళ అయి ఉంటే #SheInspiresUs ట్యాగ్‌తో మీ కథనాలు, సక్సెస్ స్టోరీలను షేర్ చేసుకోవాలని మహిళలకు ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ఖాతాలు ఒకరోజు వినియోగించుకునే అవకాశాన్ని పొందాలంటూ ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ ద్వారా మహిళలకు సందేశాన్ని పంపారు. ఈ క్రమంలో ఉపాసన స్పందించి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News