GHMC Mayor Election 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు, అన్ని పార్టీల కార్పొరేటర్లను వెంటాడుతున్న భయం!

GHMC Mayor Election 2021: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలుత కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 11, 2021, 11:21 AM IST
  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు
  • ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది
  • అనంతరం జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది
GHMC Mayor Election 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు, అన్ని పార్టీల కార్పొరేటర్లను వెంటాడుతున్న భయం!

GHMC Mayor Election 2021: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు జరుగుతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత గురువారం (ఫిబ్రవరి 11) నాడు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మేయర్ ఓటింగ్ జరగనుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు(GHMC Mayor Elections) అన్ని పార్టీల కార్పొరేటర్లకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఓటింగ్ విషయాన్ని పక్కన పెడితే ప్రాణాలకు ముప్పు వస్తుందేమోనన్న భయమే జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లలో కనిపిస్తున్నట్లు సమాచారం. దాదాపు 3 గంటలపాటు ఒకే హాల్‌లో 200కు పైగా మంది ఉండాల్సి ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ సైతం లేకపోవడంతో కార్పొరేటర్లు తమ ఆరోగ్య భద్రతపై ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.

Also Read: GHMC గెజిట్‌ వచ్చేసింది.. మేయర్ ఎన్నిక దిశగా అడుగులు

ఎలాంటి కరోనా టెస్టులు(CoronaVirus) నిర్వహించకుండా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ నిర్వహించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ డిస్టాన్సెంగ్ సైతం కరువైందని కొందరు కార్పొరేటర్లు లోలోపల భయంతో ఉన్నారని, అయితే పార్టీలకు సంబంధించిన విప్ నేపథ్యంలో తప్పనిసరిగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు హాజరవుతున్నారు.

Also Read: GHMC Elections: నేరెడ్‌మెట్ టీఆర్ఎస్‌దే.. 56కు చేరిన గులాబీ కార్పొరేటర్ల సంఖ్య

ఇదివరకే ఓ కార్పొరేటర్ చనిపోవడంతో నూతన కార్పొరేటర్లను కలవరానికి గురిచేస్తోంది. బీజేపీకి చెందిన లింగోజిగూడ కార్పొరేటర్ ఇటీవల కన్నుమూశారు. ప్రస్తుతం వీరు అధిక సంఖ్యలో సమావేశం కానుండటం, అనంతరం ఒకే హాలులో 200కు పైగా సభ్యులు చేరడంతో ఎన్నికల ఆందోళనకు మించి ఆరోగ్యంపై ఆందోళన నెలకొన్నట్లు సమాచారం.

కాగా, హైదరాబాద్ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News