Amrapali: ఆమ్రపాలికి తిండి తిప్పలు.. పబ్లిక్ గా నవ్వుతూ చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్.. వీడియో వైరల్..

Ghmc Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి తాను ప్రతిరోజు ఫుడ్ డెలివరీ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇది ఫుడ్ డెలీవరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నానని మీటింగ్ లో ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 8, 2024, 10:24 PM IST
  • ఫుడ్ డెలీవరీతో ఇబ్బందులు పడుతున్న ఆమ్రాపాలీ..
  • ఇతరుల ఫుడ్ మాకు వస్తున్నాయని ఆవేదన..
Amrapali: ఆమ్రపాలికి తిండి తిప్పలు.. పబ్లిక్ గా నవ్వుతూ చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్.. వీడియో వైరల్..

Ghmc commissioner Amrapali shares funny incident on food delivery video goes viral: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ ప్రస్తుతం పాలనతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజల మధ్యలో తిరుగుతూ.. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల కొన్నిచోట్ల మాల్స్ లలో పార్కింగ్ చేసినందుకు వాహానాలకు చార్జీలు వసూలు చేస్తున్నారని కమిషనర్ ఆమ్రాపాలికి ఫిర్యాదులు అందాయి. దీంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సంబంధించి మాల్స్ లపై చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా.. ఇటీవల కొన్ని చోట్ల చెరువులు కబ్జాలు చేస్తున్నాట్లు కూడా బల్దియాకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమ్రాపాలీ శివాలెత్తిపోయారు. ఆయా జోనల్ కమిషర్ లకు క్లాసులు సైతం పీకినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే బోనాలు, రంజాన్ పండుగలు ముగిశాయి.మరల వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. దీని కోసం ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా.. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వే నడుస్తుంది.ఈ క్రమంలో ఆమ్రాపాలీ అధికారులతో సమావేశంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

 

పూర్తి వివరాలు.. 

 

జీహెచ్ఎంసీ కమిషన్ ఆమ్రాపాలీ తాను కుందర్ బాద్ ఐఎఫ్ క్వార్టర్స్ లో ఉంటున్నట్లు చెప్పారు. అక్కడ తాను తుంగభద్ర బ్లాక్ లో ఐదో ఫ్లోర్ లో ఉంటానని చెప్పారు. అయితే.. తన క్వార్టర్స్ లో ప్రాణహిత, తుంగభద్ర రెండు బ్లాక్ లు ఉంటాయని, ప్రాణహితలో లిఫ్ట్ ఎక్కితే.. ఐదు ప్రెస్ చేస్తేు.. తన   ఫ్లోర్ కువస్తారని, అదే  తుంగ భద్ర లిఫ్ట్ ఎక్కితే.. నాలుగో బటన్ లో ప్రెస్ చేస్తే తన ఇంటికి వస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తాను ఫుడ్ డెలీ వరి పెడితే.. డెలీవరీ బాయ్ లు తన ఇంటికి రావడానికి నానా తంటాలు పడతారని ఆమె చెప్పారు..

కొన్నిసార్లు ఇతరుల ఫుడ్ ఐటమ్స్ తమ ఇంట్లోకి ఇచ్చి వెళ్తుంటారని కూడా ఫన్నీగా చెప్పారు. దీంతో తాము మరల వాటని రిటర్న్ చేస్తానని చెప్పుకొచ్చింది. అందుకు జియో సర్వే వల్ల.. లోకేషన్ ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేయోచ్చని ఆమ్రాపాలి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more: Hyderabad: బాబోయ్.. కండక్టర్ పై కోపంతో బ్యాగ్ లోని పామును విసిరిన వృద్ధురాలు .. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ అధికారులు నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, భవన నిర్మాణ అనుమతులు మొదలైన వాటిని తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు కూడా అధికారులకు సహాకరిస్తున్నారు.  ఇటీవల ఈ వ్యవహరంలో కూడా ఆమ్రాపాలీ వ్యక్తిగత వివరాలు, ఆధార్ కార్డు వంటివి చెప్పాల్సిన అవసరంలేదంటూ కూడా తెల్చిచెప్పారు. ఎవరైన అడిగిన కూడా చెప్పొందంటూ సూచించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News