GHMC: డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య రాసలీలలు.. ఫోటోలు, వీడియోలు వైరల్

GHMC Alwal Deputy commissioner viral photos: హైదరాబాద్: తిప్పర్తి యాదయ్య.. ఈ పేరు ఇంతకుముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. జీహెచ్ఎంసీలో అతడు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఎంతో గౌరవం, మన్ననలు అందుకోవాల్సిన వాడు తన దరిద్రపుగొట్టు పనులతో ఆ హోదాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 7, 2021, 11:40 PM IST
GHMC: డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య రాసలీలలు.. ఫోటోలు, వీడియోలు వైరల్

GHMC Alwal Deputy commissioner viral photos: హైదరాబాద్: తిప్పర్తి యాదయ్య.. ఈ పేరు ఇంతకుముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. జీహెచ్ఎంసీలో అతడు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఎంతో గౌరవం, మన్ననలు అందుకోవాల్సిన వాడు తన దరిద్రపుగొట్టు పనులతో ఆ హోదాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. గాళ్ ఫ్రెండ్‌తో ఏకంగా ఆఫీసులోనే రాసలీలలు ఆడటమే కాకుండా ఆ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీసున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మహిళా సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

జీహెచ్ఎంసీ పరిధిలోని అల్వాల్‌ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌‌గా విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి యాదయ్య (Alwal Deputy commissioner Thipparthi Yadaiah) ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్‌లో వైరల్ అవుతున్నప్పటికీ.. ఆ ఫోటోలు, వీడియోలు లీక్ అవడం వెనుకున్నది ఎవరో తెలిస్తే మరింత ఆశ్చర్యపోవడం మీవంతు అవుతుంది. ఎందుకంటే ఆ ఫోటోలను తనే సొంతంగా తన వాట్సాప్ గ్రూప్స్‌లో పోస్ట్ చేశాడు కాబట్టి. అవును.. అలా అమ్మాయితో ఫోజిచ్చిన ఫోటోలు, వీడియోలతో తన పరపతిని పెంచుకోవచ్చని భ్రమపడ్డాడో లేక ఆ అమ్మాయిని అభాసుపాలు చేయాలనుకున్నాడో తెలీదు కానీ వాటిని తన వాట్సాప్ గ్రూప్స్‌లో పోస్ట్ చేశాడట. అవి కాస్తా వైరల్‌గా మారడంతో అల్వాల్ సర్కిల్ ఆఫీసులో రోజూ ఆయనకు నమస్కారం పెట్టిన చేతులే ఇప్పుడు యాదయ్యపై దుమ్మెత్తిపోస్తున్నాయి.

తిప్పర్తి యాదయ్య వైఖరిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తన హోదా, పరపతితో యువతులను లొంగదీసుకుని (Trapping women) వారిని ఇలా బజారుకీడ్చే పనిలో యాదయ్యకు బాగా అలవాటున్న పనిలా ఉందని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాకుండా గతంలోనూ యాదయ్యపై ఈ తరహా ఆరోపణలు రావడంతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న తిప్పర్తి యాదయ్యను తక్షణమే సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి.

Trending News