మరికొద్ది గంటల్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రారంభం కానుంది. భారత అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఈ సదస్సుకు దాదాపు 127 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. "మహిళలే ప్రథమం- అందరికీ శ్రేయస్సు" అనే నినాదంతో ఈ సదస్సు ప్రారంభమవనుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇప్పటికే హెచ్ఐసీసీ వద్దకు ప్రతినిధులు చేరుకున్నారు. సినీ నటుడు రామ్ చరణ్, మాజీ క్రికెటర్ రామ్ చరణ్, ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర మొదలైనవారు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ సదస్సుకు హాజరయ్యే ఇవాంకా ప్రధాని ఫలక్నామాలో అందించే ప్రత్యేక విందుకు కూడా హాజరు కానున్నారు. మూడు గంటలకే వేదకకు చేరుకోనున్న ఇవాంకా తొలుత భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ని కలుస్తారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సులో మూడుసార్లు ఇవాంకా ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ట్రిడెంట్ హోటల్లో ఆమె బస చేశారు.