Balapur Laddu: వినాయక నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. బడా గణేష్ ను చూడటానికి దేశ, విదేశాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు. మహా గణపతి ఎంత ఫేమసే.. బాలాపూర్ లడ్డూ అంతే గుర్తింపు తెచ్చుకుంది. బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగుతుంటుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట చూసేందుకు వేలాది మంది తరలివస్తుటారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ ధర ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది. గత ఏడాది రూ. 27 లక్షలు పలికింది.ఈసారి ఎంత పలుకుతుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రక్రియను నిర్వాహకులు మార్చేశారు. ముందుగా డబ్బును డిపాజిట్ చేస్తేనే వేలం పాటలో పాల్గొనే అవకాశం ఇవ్వనున్నారు.
బాలాపూర్ గ్రామస్థులతో పాటు వేలంలో పాల్గొనాలనుకునే వాళ్లంతా.. గతేడాది లడ్డూ వేలం విలువ అయిన 27 లక్షల రూపాయలను.. వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నా తర్వాతే.. వేలం పాటలో పాల్గొనాలన్నది ఈసారి రూల్. ఈ నిబంధనలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఇదంతా డబ్బున్న బడా బాబులు పాల్గొనే వేలంగా మార్చివేసారన్న ముచ్చట వినబడుతుంది.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.