Hyderabad: మిఠాయి పాడైందని నెటిజన్ ట్వీట్...జీహెచ్ఎంసీ రియాక్షన్.. కరాచీ బేకరీకి రూ.10వేల జరిమానా!

GHMC Fined to Karachi Bakery: హైదరాబాద్ లోని ప్రముఖ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆహార నాణ్యత పాటించని కారణంగా.. రూ.10వేల జరిమానా విధించారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2022, 11:46 AM IST
  • కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ చర్యలు
  • రూ.10వేల జరిమానా విధించిన అధికారులు
  • ఆహార నాణ్యత పాటించనందుకు చర్యలు
Hyderabad: మిఠాయి పాడైందని నెటిజన్ ట్వీట్...జీహెచ్ఎంసీ రియాక్షన్.. కరాచీ బేకరీకి రూ.10వేల జరిమానా!

GHMC Fined to Karachi Bakery: హైదరాబాద్‌లోని (Hyderabad) కరాచీ బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయిలపై బూజు ఉందంటూ..ఓ వినియోగదారుడు ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ అధికారులకు (GHMC officials) ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్..వెంటనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.

ఖాజాగూడలోని (khajaguda) కరాచీ బేకరీలో (Karachi Bakery) కొనుగోలు చేసిన మిఠాయి చెడిపోయిందని ఓ పౌరుడి జీహెచ్ఎంసీ అధికారులు  ఫిర్యాదు చేశాడు. దీంతో సర్కిల్‌ సహాయ వైద్యాధికారి కె.ఎస్‌.రవి, ఆహార కల్తీ నియంత్రణ అధికారి సూర్య వెంటనే బేకరీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్‌ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడాన్ని నిర్ధారించిన అధికారులు అక్కడికక్కడే రూ.10వేల జరిమానా (GHMC Fined to Karachi Bakery) విధించారు. 

Also Read: Telangana liquor sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ కొత్త రికార్డు- నెలలో రూ.3,350 కోట్ల విక్రయాలు!

ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని, ఫలితం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అయితే కరాచీ బేకరీకి చెందిన ఆహార పదార్థాల్లో నాణ్యత సరిగ్గా ఉండటం లేదంటూ నెటిజన్లు (Netizens) కామెంట్లు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News